తెలుగు సినిమాకు ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. 100 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో మొదటిసారి తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చింది. సినిమా రంగంలోనే అత్యున్నత పుసర్కారం కావడంతో యావత్ దేశం ఆస్కార్ అవార్డు వచ్చినందుకు గర్వపడుతోంది. మొదటి నుండి ఆర్ఆర్ఆర్ కు ఏదో ఒక విభాగంలో ఆస్కార్ పక్కా అని విశ్లేషకులు అంచనా వేశారు.
Advertisement
ALSO READ :చైనాలో పురుగుల వర్షం… ఏదైనా డ్రాగన్ సిటీకి సాధ్యం!
కాగా ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాట ఆస్కార్ కు నామినేట్ అయ్యింది. ఆ తరవాత అభిమానుల్లో ఆస్కార్ వరిస్తుందా లేదా అనే టెన్షన్ మాత్రం ఉండిపోయింది. కానీ నేడు ఉదయం సినిమాలోని నాటునాటు పాటకు ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీలో ఆస్కార్ వచ్చింది. అయితే నిజానికి ఈ సినిమాకు స్వరాలు సమకూర్చింది కీరవాణి…పాటకు లిరిక్స్ రాసింది రచయిత చంద్రబోస్..కాగా దర్శకుడు రాజమౌళి కృషి ఆర్ఆర్ఆర్ విషయంలో వెలకట్టలేనిది.
Advertisement
జక్కన్న ఈ సినిమాను ఎంతో కష్టపడి ఏళ్లు తరబడి షూటింగ్ చేశాడు. అంతే కాకుండా సినిమాను ప్రమోట్ చేయడంలోనూ జక్కన్న ఎక్కడా తగ్గలేదు. ఈ సినిమాకు రాత్రింబవళ్లు కష్టపడుతూ ప్రచారం చేశారు. అంతే కాకుండా ఈ సినిమా నెటిఫ్లిక్స్ లో విడుదల చేసిన తరవాత ప్రశంసలు అందడంతో అమెరికాకు వెళ్లి అక్కడ షో లు వేసి మరీ విదేశీయుల ప్రశంసలు అందుకున్నాడు.
ఇక ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కు నామినేట్ అయిన తరవాత టీమ్ తో కలిసి అమెరికాలో ఉంటూ ప్రమోషన్స్ నిర్వహించాడు. అలా ఆస్కార్ రావడానికి చాలా మంది కష్టపడినప్పటికీ జక్కన్న అందులో ముఖ్యమైన వ్యక్తి. ఇక ఎట్టకేలకు ఆస్కార్ ను అనౌన్స్ చేయడంతో జక్కన్న తో పాటూ ఆ సినిమాకు పనిచేసిన ప్రతిఒక్కరూ గర్వంగా ఫీల్ అవుతున్నారు.
Advertisement
ASLO READ :సీనియర్ ఎన్టీఆర్ లాంగ్ డ్రైవింగ్ చేస్తే… కుక్కలు, కోళ్లు అవుట్ అంతే…!