Home » IGNOU 2022 July Admission : మ‌రోసారి రిజిస్ట్రేష‌న్ పొడిగింపు.. చివ‌రి తేదీ ఎప్పుడంటే..?

IGNOU 2022 July Admission : మ‌రోసారి రిజిస్ట్రేష‌న్ పొడిగింపు.. చివ‌రి తేదీ ఎప్పుడంటే..?

by Anji
Ad

ఇందిరాగాంధీ నేష‌న‌ల్ ఓపెన్ యూనివ‌ర్సిటీ మ‌రోసారి జులై 2022 సెష‌న్ కోసం దర‌ఖాస్తుల స‌మ‌ర్ప‌ణ‌కు చివ‌రి తేదీని పొడిగించింది. త‌మ ద‌ర‌ఖాస్తు ఫార‌మ్‌ల‌ను స‌మ‌ర్పించ‌ని అభ్య‌ర్థులు, అధికారిక వెబ్ సైట్ సంద‌ర్శించి సెప్టెంబ‌ర్ 22, 2022 లోపు ద‌ర‌ఖాస్తు స‌మ‌ర్పించాల‌ని సూచించింది. ఇక ఇంత‌కు ముందు జులై సెష‌న్ కోసం రీ రిజిస్ట్రేష‌న్ చివ‌రి తేదీ ఆగ‌స్టు 25 వ‌ర‌కు ఉండేది. ఆ త‌రువాత సెప్టెంబ‌ర్ 9 వ‌ర‌కు పొడిగించారు. మ‌ళ్లీ ఈ రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ను సెప్టెంబ‌ర్ 22 వ‌ర‌కు పెంచింది. IGNOU సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్ ట్విట్ట‌ర్‌లో రీ-రిజిస్ట్రేష‌న్ పొడిగించిన తేదీ గురించి స‌మాచారాన్ని అందించింది. అభ్య‌ర్థులు ignouadmission.samarth.edu.in అధికారిక వెబ్‌సైట్‌లో ఇగ్నోలో అడ్మిష‌న్ కోసం ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.


IGNOU త‌న అధికారిక వెబ్ సైట్‌లో దీనికి సంబంధించి నోటీసును జారీ చేసింది. మ‌రింత స‌మాచారం కోసం అభ్య‌ర్థులు జారీ చేసిన నోటీస్‌ను త‌నిఖీ చేయ‌వ‌చ్చు. రిజిస్ట్రేష‌న్ కోసం అభ్య‌ర్థి రూ.250 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తు రుసుము ఆన్‌లైన్‌లో చెల్లించాలి. SC/ST కేట‌గిరి అభ్య‌ర్థుల‌కు ఫీజు మిన‌హాయించ‌బ‌డింది. అడ్మిష‌న్ స‌మ‌యంలో మొద‌టి సెమిస్ట‌ర్ సంవ‌త్స‌రానికి ప్రోగ్రామ్ ఫీజుతో పాటు రిజిస్ట్రేష‌న్ ఫీజును చేయ‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ యూనివ‌ర్సిటీలో ఇప్ప‌టికే ఏదైనా కోర్సులో అడ్మిష‌న్ తీసుకున్న అభ్య‌ర్థుల‌కు ఈ స‌దుపాయం అందుబాటులో ఉంది. ఆసక్తి గ‌ల అభ్య‌ర్థులు త‌దుప‌రి సెష‌న్‌లో చేరాల‌నుకుంటే చివ‌రి తేదీలోగా త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను స‌మ‌ర్పించాల‌ని సూచించారు. ప్ర‌స్తుతం విశ్వ‌విద్యాల‌యం అందించే ఏదైనా కోర్సులు అండ్ ప్రోగ్రామ్‌ల్లో న‌మోదు చేసుకున్న విద్యార్థులు గ‌డువు కన్నా ముందే రీ ఎన్ రోల్‌మెంట్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని సూచించారు. ద‌ర‌ఖాస్తుదారులు తిరిగి న‌మోదు న‌మోదు ప్ర‌క్రియ‌ను పూర్తి చేయ‌కుండా సెమిస్ట‌ర్‌కు ఏ అభ్య‌ర్థిని అనుమ‌తించ‌రు.

Advertisement

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  బ్రిట‌న్ రాజ‌వంశం రాజ‌కీయాల్లోకి రాక‌పోవ‌డానికి కార‌ణం అదేనా..?

రీ రిజిస్ట్రేష‌న్ చేసుకునే విధానం :

  • తొలుత అభ్య‌ర్థులు IGNOU అధికారిక వెబ్‌సైట్ https://ignou.samarth.edu.in కి వెళ్లండి
  • ఇప్పుడు అభ్య‌ర్థి రీ రిజిస్ట్రేష‌న్ లింక్ పై క్లిక్ చేయండి.
  • అభ్య‌ర్థులు వారి న‌మోదు ID అండ్ ప్రోగ్రామ్ కోడ్ ను న‌మోదు చేయాలి.
  • ఆ త‌రువాత అభ్య‌ర్థి ద‌ర‌ఖాస్తు ఫీజును స‌మ‌ర్పించాలి.
  • ఇప్పుడు అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు ఫార‌మ్‌లో పేర్కొన్న వివ‌రాల‌ను న‌మోదు చేయాలి. ఇక ఆ త‌రువాత ఫైన‌ల్ స‌బ్ మిట్ చేయాలి.
  • ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు భ‌విష్య‌త్ అవ‌స‌రాల కొర‌కు అప్లికేష‌న్ ఫార‌మ్ ని ప్రింట్ తీసుకొని ద‌గ్గ‌ర పెట్టుకోవాలి.

ఇది కూడా చ‌ద‌వండి : చిరంజీవికి కృష్ణంరాజు ఇచ్చిన అత్యంత ఖ‌రీదైన బ‌హుమ‌తి ఏంటో తెలుసా..?

Visitors Are Also Reading