బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వేల విషయాల గురించి చెప్పారు. ఇప్పటికే వాటిలో కొన్ని నిజం అయ్యాయి. అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ అయింది. దొంగస్వాములు పుట్టుకురావడం.. ఆరేళ్ల పాప గర్భవతి అవ్వడం.. ఆడవాళ్లు మానం అమ్ముకోవడం, గాంధీలాంటి మహాత్ముడు స్వాతంత్య్రం తీసుకురావడం ఇలా చాలానే జరిగాయి. ముఖ్యంగా బ్రహ్మంగారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ లో ఓ వింత సంఘటన జరిగింది. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ముఖ్యంగా దేవీ శక్తిపీఠాలలో ఒకటైన శక్తి పీఠం ఆలంపూర్ జోగులాంబ…ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. అయితే 2032లోపు అమ్మవారి కంట నీరు.. స్తనాల నుంచి పాలు కారుతాయని చెప్పారు. కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ద పుణ్యక్షేత్రం ఉంది. అందులోని యాగంటి నందీశ్వరుడు అంతకంతకూ పెరిగి రాళ్లు మింగితాడని చెప్పారు. అయితే నందీశ్వరుడి చుట్టూ తిరిగేందుకు వందల సంవత్సరాల క్రితం స్థలం ఉండేదట. కానీ నందీశ్వరుడు పెరగటం వల్ల ఇప్పుడు స్థలం లేకుండా పోయింది. 20సంవత్సరాలకు ఒకసారి విగ్రహం ఒక అంగులం పెరుగుతుంని పురావస్థు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. 2028 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలుస్తుందట. 2034లోపు ప్రపంచ వినాశనం తప్పదని బ్రహ్మంగారు తన కాలజ్క్షానంలో చెప్పారు.
Advertisement
బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం.. ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతాయని. చెప్పినట్టుగా చాలావరకు వాస్తవమయ్యాయి. అలాంటిదే ఇది కూడా. కంద దుంప నుంచి అరటి గెల రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వింతను చూసేందుకు జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. గతంలో వేప చెట్టుకు పాలు కారడం లాంటి వింతలు చూశాం. అటువంటి వింతే ఒకటి కోనసీమలో చేసుకుంది. వేగిరాజు సుబ్బరాజు నివాస స్థలంలో కంద దుంప నుంచి అరటి గెల ఆకృతి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇలాంటి వింతను ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎప్పుడు చూడలేదు అంటూ చుట్టుపక్కల ప్రజలు ఈ వింతను చూసేందుకు భారీగా తరలి వస్తున్నారు. అయితే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినటువంటి వింత మరోసారి నిజమైనదని నమ్ముతున్నారు. తమ ఇంటి ఆవరణలో ఇటువంటి వింత జరగడంతో సుబ్బరాజు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
2023లో ఏం జరుగుతుందో బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు!
బ్రహ్మంగారు చెప్పిందే జరిగిందిగా..సెలూన్లో యువతికి షేవింగ్..!