Home » దీపావళి పండుగ రోజు.. ఏ రాశి వారు ఎలాంటి దుస్తులు ధరిస్తే మంచిదో తెలుసా ?

దీపావళి పండుగ రోజు.. ఏ రాశి వారు ఎలాంటి దుస్తులు ధరిస్తే మంచిదో తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా ఏదైనా పండుగ వచ్చినప్పుడు కొత్త దుస్తులను కొనడం ఓ సంప్రదాయం. అయితే నవంబర్ 12న దీపావళి పండుగ సందర్భంగా మీరు  కొత్త దుస్తులను కొంటున్నారా? మీ రాశి ప్రకారం ఏ దుస్తులు కొని వాటిని ధరిస్తే ఎక్కువ లాభం పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

దీపావళి  సందర్భంగా ప్రజలు కొత్త దుస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. పండుగ రోజు కొత్త దుస్తువులు వేసుకోవడం ఫ్యాషన్ కాదు.దీని వెనుక మన సాంస్కృతి, సంప్రదాయాలు ఎన్నో ఉన్నాయని పండితులు చెబుతున్నారు. కొత్త బట్టలు మంచికి సంకేతం.మన రాశి గ్రహం మన జీవన శైలి, మనం ధరించే దుస్తులు అన్ని ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి.  ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశి వారు తమ ధైర్యం, శక్తిమంతమైన స్వభావానికి ప్రసిద్ధి చెందారు.వారి వ్యక్తిత్వాన్ని హైలెట్  చేసే ముదురు ఎరుపు, బంగారు రంగు ధరించడం మంచిది.అలాగే వృషభ రాశి వారు పచ్చ లేదా మెరూన్ వంటి లోతైన రంగుల దుస్తువులను ధరించాలి. అలాగే మిధున రాశి వారు రంగురంగుల దుస్తువులను ధరించడం మంచిది. 

Advertisement

అలాగే కర్కాటక రాశి వారు బనారస్ సిల్క్ దుస్తువులను ధరించాలి.అలాగే సింహరాశి  వారు రాయల్ బ్లూ లేదా డార్క్ మెరూన్ దుస్తువులను  ధరించాలి. ముఖ్యంగా చెప్పాలంటే కన్య రాశి వారు మృదువైన మృదువైన పాస్టెల్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చికాంకరి చీరను ధరించడం మంచిది. వెండి నగలు దీనికి సరిగ్గా సరిపోతాయి.అలాగే తుల రాశి  వారు పింక్  , లావెండర్ షేడ్స్‌తో కూడిన అందమైన అనార్కలి గౌను ధరించడం మంచిది. వృశ్చిక రాశి వారు ముదురు ఎరుపు లేదా నలుపు రంగులతో అలంకరించిన చీరను ధరించాలి. అలాగే ధనస్సు రాశి వారు బంధిని ప్రింట్ లెహంగా ను ధరించడం మంచిది. మకర రాశి వారు ఆకుపచ్చ లేదా మెరూన్ రంగు గల దుస్తులను ధరించాలి. కుంభ రాశి వారు సాంప్రదాయ రంగుల దుస్తులను ధరించాలి. మీన రాశి వారు సి గ్రీన్ లేదా లైట్ బ్లూ రంగు దుస్తులను ధరించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.  

మరికొన్ని తెలుగు లైఫ్ స్టైల్ వార్తలకు ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading