Home » జనవరి 13న ఆ రాశిలోకి కుజుడు సంచారం.. ఈ 5 రాశుల వారికి మామూలుగా ఉండదు..!

జనవరి 13న ఆ రాశిలోకి కుజుడు సంచారం.. ఈ 5 రాశుల వారికి మామూలుగా ఉండదు..!

by Anji
Ad

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ప్రతి గ్రహం ఓ నిర్దిష్ట సమయంలో తన రాశి చక్రాన్ని మారుస్తుంటుంది. ఈ తరుణంలోనే అంగారకుడు త్వరలోనే తన రాశి చక్రాన్ని మార్చుకోబోతున్నాడు. 2023 జనవరి 13న వృషభ రాశిలోకి అంగారకుడు సంచరిస్తాడు. ధైర్యం, పరాక్రమంకి కారకుడు అయినటువంటి కుజుడు ప్రత్యక్షంగా సంచరించడంతో ఈ రాశుల వారికి ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రధానంగా కుజుడి సంచారంతో ఈ 5 రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

వృషభం : 

ఈ రాశిలో కుజుడు ప్రత్యక్ష సంచరించడంతో వీరికి ప్రయోజనం చేకూరుతుంది. కష్టానికి తగిన ఫలాలను పొందుతారు. మీ కోరిక నెరవేరుతుంది. దూర ప్రయాణం చేయవచ్చు. వ్యాపారంలో ఏదైనా కొత్తగా చేయాలనుకుంటే సరైన సమయం. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. 

సింహం :

సింహ రాశి వారికి కుజుడి సంచారం అద్భుతమైన ప్రయోజనాలుంటాయి. కొత్త టెండర్ కోసం దరఖాస్తు చేస్తే విజయం సాధిస్తారు. మీ కృషి, నిజాయితీతో లక్ష్యాలను సాధిస్తారు. ఉద్యోగంలో మంచి ఫలితాలను సాధిస్తారు. అన్ని పనులలో పురోగతి సాధిస్తారు. 

Advertisement

వృశ్చికం :

కుజ సంచారంతో వృశ్చిక రాశి వారికి పనుల పట్ల చాలా ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పు రావాలనుకుంటే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. పెట్టుబడి పెడితే మంచి లాభాలుంటాయి. వృత్తిలో పురోగతి ఉంటుంది.

ధనుస్సు  :

కుజ ప్రత్యక్ష సంచారంతో ధనస్సు రాశి వారికి పెట్టుబడుల్లో లాభాలుంటాయి. మీరు అనుకున్న పనిని పూర్తి చేస్తారు. కొత్త ఉద్యోగ అన్వేషణ ముగుస్తుంది. మీ బాధ్యతలు పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామికి సమయం ఇస్తారు. 

మీనం :

అంగారకుడు సంచరించడంతో మీన రాశి వారి వ్యక్తిత్వంలో మార్పులు తీసుకొస్తుంది. ధైర్యం, బలం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రాశి వారి కెరీర్ గొప్ప విజయాన్ని పొందవచ్చు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అన్ని పనులలో మంచి ఫలితాలను పొందుతారు. 

Also Read :  Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు 2022 ఆ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి..!

Visitors Are Also Reading