Home » నటి కస్తూరిపై ఓంకార్ హాట్ కామెంట్స్.. ఏ యాంగిల్ లో చూసినా !

నటి కస్తూరిపై ఓంకార్ హాట్ కామెంట్స్.. ఏ యాంగిల్ లో చూసినా !

by Bunty

నటి కస్తూరి గురించి తెలియని అభిమానులు ఉండరు. హిందుస్థాని, అన్నమయ్య, మిస్ మద్రాస్ వంటి ఇంకా ఎన్నో అనేక సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగు చిత్రాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా బుల్లి తెరపై సీరియల్స్, వెబ్ సిరీస్ లలో నటిస్తుంది. కొంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీకి పరిచయమైన తొలినాళ్లలోనే ఒకటి, రెండు సినిమాలతోనే గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరం అవుతారు.

కానీ కొంతమంది మాత్రం ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంటారు అందులో కస్తూరి కూడా ఒకరు. మాటీవీలో ప్రసారమయ్యే ఇంటింటి గృహలక్ష్మి సీరియల్స్ లో నటిస్తూ అభిమానులను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ. అలాగే కొన్ని షోలకి కూడా గెస్ట్ గా వచ్చి ఆడియన్స్ ను సందడి చేస్తోంది కస్తూరి. తాజాగా మాటీవీలో ప్రసారమయ్యే ఓంకార్ సిక్స్త్ సెన్స్ షోలో గెస్ట్ గా వచ్చింది కస్తూరి. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట్లో వైరల్ గా మారింది.

కస్తూరి షోకి ఎంట్రీ ఇచ్చి డ్యాన్స్ చేసిన వెంటనే ఓంకార్ కస్తూరిపై బోల్డ్ కామెంట్స్ చేశారు. కస్తూరిగారు మిమ్మల్ని ఏ యాంగిల్ లో చూసిన మీరు మదర్ లా అస్సలు లేరు… మరదలు గానే ఉన్నారు అంటూ చాలా బోల్డ్ గా ఓంకార్ కామెంట్స్ చేశారు. ఇక కస్తూరిని ఓంకార్ మరదలు అని అనడంతో సిగ్గుపడింది. కస్తూరి వ్యక్తిగత విషయానికి వస్తే తనకు 46 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా యంగ్ గా కనిపిస్తూ తన అందాన్ని రోజు రోజుకి మరింత రెట్టింపు చేసుకుంటూ పోతోంది. కస్తూరికి వివాహం జరిగి ఇద్దరు పిల్లలు కూడా ఉన్న సంగతి తెలిసిందే.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

కిచ్చా సుదీప్ పై ప్రకాష్ షాకింగ్ కామెంట్స్… బిజెపికి మద్దతు ఇవ్వడం ఏంటి..?

తిరుమల శ్రీవారిని వడ్డీ కాసుల వాడు అని ఎందుకు అంటారు ?

నా లో దుస్తులు చూడాలని డైరెక్టర్ కోరాడు – ప్రియాంక చోప్రా

Visitors Are Also Reading