Home » ఒక్క‌డు సినిమాలో ధ‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌మ‌ణ్యం చెప్పిన ఆ నెంబ‌ర్ ఎవ‌రిదో తెలుసా..?

ఒక్క‌డు సినిమాలో ధ‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌మ‌ణ్యం చెప్పిన ఆ నెంబ‌ర్ ఎవ‌రిదో తెలుసా..?

by AJAY

మ‌హేశ్ బాబు హీరోగా గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఒక్క‌డు. ఈ సినిమాలో భూమిక హీరోయిన్ గా న‌టించగా ప్ర‌కాష్ రాజ్ విల‌న్ పాత్ర‌లో న‌టించారు. 2003లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం ఇండ‌స్ట్రీ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా సినిమాలో చార్మినార్ బ్యాక్ డ్రాప్ లో వ‌చ్చే సీన్లు మ‌రియు ప్ర‌కాష్ రాజ్ మ‌హేశ్ బాబు మ‌ధ్య ఉండే పోరాట స‌న్ని వేశాలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి.

Also Read: ఎసిడిటీ, అజీర్ణంతో బాధ‌ప‌డుతున్నారా.. ఈ చిట్కాలు త‌ప్ప‌క పాటించండి..!

okkadu phone number scene

భూమిక మ‌హేష్ బాబు మ‌ధ్య ఉండే రొమాంటిక్ స‌న్నివేశాలు కూడా ఈ చిత్రానికి ప్ల‌స్ గా నిలిచాయి. ఇక ఈ చిత్రంలో కామెడీ కూడా అదే రేంజ్ లో ఆక‌ట్టుకుంది. సినిమాలోని మ‌రిచిపోలేని స‌న్నివేశాల్లో ద‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌మ‌ణ్యంతో మ‌హేశ్ బాబు మ‌రియు అత‌డి స్నేహితులు ఓ ఆట ఆడుకునే సీన్.

okkadu phone number scene

ద‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌మ‌ణ్యం ఈ సినిమాలో పాస్ పోర్ట్ ఆఫీస‌ర్ ప‌నిచేస్తాడ‌న్న సంగ‌తి తెలిసిందే. సినిమాలో భూమిక‌ను అమెరికా పంపించేందుకు మ‌హేశ్ బాబు పాస్ పోర్ట్ ఆఫీస్ కు వెళ‌తాడు. అదే స‌మ‌యంలో ద‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌మ‌ణ్యం కొత్త సెల్ ఫోన్ కొంటాడు. అంతే కాకుండా ఆ సెల్ నెంబ‌ర్ త‌న ప్రియురాలికి చెప్పి ఈ ఫోన్ లో మొద‌టి ఫోన్ కాల్ నీదే కావాలి అంటూ కోరుతాడు. త‌న నెంబ‌ర్ 9848032919 అంటూ చెబుతాడు. అయితే అప్ప‌టికే పాస్ పోర్ట్ కోసం వ‌చ్చిన మహేశ్ బాబు పాస్ పోర్ట్ ఇవ్వాల‌ని కోర‌గా పోస్ట్ లో పంపిస్తాం అంటూ కేర్ లెస్ గా స‌మాధానం ఇస్తాడు. దాంతో మ‌హేశ్ అత‌డి స్నేహితులు అంద‌రూ క‌లిసి ద‌ర్మ‌వ‌రపు సుబ్ర‌మ‌ణ్యం నంబ‌ర్ కు ఫోన్ చేసి విసిగిస్తారు.

okkadu phone number scene

అది త‌ట్టుకోలేక ద‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌మ‌ణ్యం ఆ ఫోన్ ను నేల‌కేసి కొడ‌తాడు. ఇక ఫోన్ ముక్క‌లైపోతుంది. అయితే ఆ ఫోన్ నంబ‌ర్ ఎవ‌రిది సినిమాలో అలా చెప్పేశారు అని అంద‌రికీ డౌట్ వ‌చ్చింది. ఆ నంబ‌ర్ ఎవ‌రిదో కాదు. ఒక్క‌డు సినిమా నిర్మాత ఎమ్ ఎస్ రాజు దే అంట‌. సినిమా విడుద‌ల అయిన త‌ర‌వాత ల‌క్ష‌ల మంది ఆ నంబ‌ర్ కు ఫోన్ చేయ‌డంతో ఆయ‌న నంబ‌ర్ ను మార్చేశార‌ట‌.

Also Read: హీరోయిన్ హీరోకు ప్ర‌సాదం పెడితే హీరో మ‌ర‌ణిస్తాడా..! ఏ సినిమా లాజిక్ అంటే..?

Visitors Are Also Reading