Home » ఒక్క‌డు సినిమాలో మ‌హేశ్ బాబు చెల్లెలు ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా..? ఏం చేస్తుందంటే..?

ఒక్క‌డు సినిమాలో మ‌హేశ్ బాబు చెల్లెలు ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా..? ఏం చేస్తుందంటే..?

by AJAY
Ad

ఒక‌ప్పుడు టాలీవుడ్ లో ప‌లు చిత్రాల‌లో న‌టించిన చైల్డ్ ఆర్టిస్ట్ లు ప్ర‌స్తుతం గుర్తు ప‌ట్ట‌లేనంతగా మారిపోతున్నారు. చాలా మంది రీఎంట్రీ ఇస్తూ హీరోహీరోయిన్ లుగా వ‌స్తోంటే. మ‌రికొంద‌రు మాత్రం సినిమాల‌కు దూరంగా ఉంటూ చ‌దువులు ఉద్యోగాల‌తో బిజీ అయిపోయారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా న‌టించిన వారిలో బేబి నిహారిక కూడా ఒక‌రు. పేరు చెబితే వెంట‌నే గుర్తుప‌ట్ట‌కపోవ‌చ్చు గానీ ఒక్క‌డు సినిమాలో మ‌హేశ్ బాబు సోద‌రి అని చెబితే ట‌క్కున గుర్తుకు వ‌చ్చేస్తుంది.

Advertisement

ఒక్క‌డు సినిమాలో మ‌హేశ్ బాబుకు సోద‌రిగా హీరోయిన్ భూమిక‌కు హెల్ప్ చేస్తూ నిహారిక న‌ట‌న ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో నిహారిక‌కు కూడా ఒక్క‌డు త‌ర‌వాత ఆఫ‌ర్ లు ఎక్కువ వ‌చ్చాయి. ఇక ఈ సినిమా కంటే ముందుగానే య‌మ‌జాత‌కుడు సినిమాలో మోహ‌న్ బాబుకు మేన‌కోడలిగా న‌టించి అల‌రించింది. ఆ సినిమాలో త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుకోవ‌డంతో గుణ‌శేఖ‌ర్ కండ పండింది.

Advertisement

ఈ చిత్రం త‌ర‌వాత‌నే ఒక్క‌డు సినిమాలో న‌టించే ఛాన్స్ కొట్టేసింది. అయితే ఆ త‌ర‌వాత సినిమా ఆఫ‌ర్ లు వ‌చ్చినా కూడా చ‌దువు పూర్తి చేయాల‌ని సినిమాల‌కు దూరంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక నిహారిక ప్ర‌స్తుతం తన చ‌దువు పూర్తి చేసుకుని మ‌ళ్లీ సినిమాల వైపు అడుగులు వేస్తున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది.

అంతే కాకుండా ఓ టాలీవుడ్ డైరెక్ట‌ర్ నిహారిక‌కు హీరోయిన్ ఆఫ‌ర్ ఇచ్చాడ‌ని కూడా ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా నిహారిక లేటెస్ట్ ఫోటోలు కూడా నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఒక్క‌డు సినిమాలో సింపుల్ గా అమాయ‌కంగా క‌నిపించిన నిహారిక ప్ర‌స్తుతం హీరోయ‌న్ లా ఫిట్ గా చాలా మోడ్ర‌న్ గా క‌నిపిస్తోంది. మ‌రి మ‌హేశ్ బాబు ఆన్ స్క్రీన్ చెల్లెలు సినిమాల్లో స‌క్సెస్ అవుతుందా లేదా అన్న‌ది చూడాలి.

Visitors Are Also Reading