Home » “ఒకే ఒక్కడు” మూవీని ఆ కారణంతో వదులుకున్న టాలీవుడ్ స్టార్ హీరో… ఒకవేళ ఆ స్టార్ హీరో చేసుంటే..!

“ఒకే ఒక్కడు” మూవీని ఆ కారణంతో వదులుకున్న టాలీవుడ్ స్టార్ హీరో… ఒకవేళ ఆ స్టార్ హీరో చేసుంటే..!

by AJAY
Ad

దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శంకర్ ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించి ఇండియా వ్యాప్తంగా దర్శకుడిగా తనకంటూ ఒక అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే శంకర్ దర్శకత్వంలో రూపొంది భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సినిమాలలో ఒకే ఒక్కడు ఒకటి.

Advertisement

ఈ మూవీలో అర్జున్ సర్జా హీరోగా నటించిన మనీషా కొయిరాల హీరోయిన్ గ నటించింది. రఘువరన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించగా లైలా ఒక్క కీలక పాత్రలో నటించింది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ 7 నవంబర్ 1999 సంవత్సరం విడుదల అయ్యి అటు తమిళ్ ఇటు తెలుగు బాక్స్ ఆఫీసుల దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా భారీ కలెక్షన్లను రాబట్టింది.

Advertisement

ఇది ఇలా ఉంటే ఈ మూవీని తెలుగు స్టార్ హీరో ఒకరు మిస్ చేసుకున్నారట… ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం. దర్శకుడు శంకర్ ఈ మూవీని తమిళ్ లో అర్జున్ తో తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో ఏకకాలంలో రూపొందించాలి అని ప్లాన్ చేసుకున్నాడట. అందులో భాగంగా చిరంజీవికి ఈ మూవీ కథను కూడా వినిపించాడట. ఈ మూవీ కథ అద్భుతంగా నచ్చినప్పటికీ చిరంజీవి అదే సమయంలో వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాలో నటించలేదట.

దానితో శంకర్ తమిళ్ మరియు తెలుగు భాషల్లో రెండింటిలోనూ అర్జున్ తోనే ఈ మూవీని రూపొందించాడట. అలా తెలుగులో చిరంజీవి “ఒకే ఒక్కడు” మూవీని వదులుకోవాల్సి వచ్చిందట. ఒకవేళ చిరంజీవి కనుక తెలుగులో ఈ మూవీని చేసి ఉంటే ఈ మూవీకి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మరింత భారీ కలెక్షన్లు వచ్చే అవకాశాలు చాలా వరకు ఉండేవి.

Visitors Are Also Reading