Home » “రాధేశ్యామ్” వాయిదా.. నిరాశ‌లో అభిమానులు

“రాధేశ్యామ్” వాయిదా.. నిరాశ‌లో అభిమానులు

by Anji
Ad

దేశ‌వ్యాప్తంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల కార‌ణంగా సినిమాలు అన్నీ వాయిదా ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే ఆర్ఆర్ఆర్ వాయిదా ప‌డిన విష‌యం అంద‌రికీ తెలిసిన‌దే. అయితే తాజాగా రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ రాధేశ్యామ్ విడుద‌ల‌పై మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చారు. సినిమా వాయిదా ప‌డుతుంద‌ని చాలా రోజుల నుండి రూమ‌ర్స్ వినిపిస్తున్నా మేక‌ర్స్ మాత్రం సినిమాను క‌చ్చితంగా విడుద‌ల చేస్తాం అని ఇప్ప‌టివ‌ర‌కు చెప్పుతూ వ‌చ్చారు. అయితే ఓ వైపు రోజు రోజుకూ ఆందోళ‌న‌క‌రంగా మారుతున్న ప‌రిస్థితులు, మ‌రొక‌వైపు రూమ‌ర్స్‌తో డార్లింగ్ అభిమానులు సినిమా విడుద‌ల గురించి ఇప్ప‌టిదాకా క‌న్ప్యూజ‌న్ లోనే ఉన్నారు అని చెప్పాలి.

చిత్రం

Advertisement

Advertisement

నిన్న‌టిదాక కూడా సినిమా విడుద‌ల ఉంటుంద‌ని చెప్పిన రాధేశ్యామ్ నిర్మాత‌లు ఎట్టకేల‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా సినిమా వాయిదా వేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం వేరే మార్గం లేక‌పోవ‌డంతో రాధేశ్యామ్ మేక‌ర్స్ సినిమాను వాయిదా వేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న క‌రోనా ప‌రిస్థితుల కార‌ణంగా మాసినిమా రాధేశ్యామ్ విడుద‌ల‌ను వాయిదా వేయాల్సి వ‌చ్చిన‌ది.

 

Radheshyam

మీ భేష‌ర‌తు ప్రేమ‌, మ‌ద్ద‌తు కోసం అభిమానులంద‌రికీ మా హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. త్వ‌ర‌లో థియేట‌ర్ల‌లో కలుద్దాం అంటూ సినిమా నిర్మాణ సంస్థ యూవీ క్రియేష‌న్స్ ఓ అధికారిక పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. టైమ్ ట్రావెల్ తో కూడిన ఈ భారీ పీరియాడిక్ ఎఫిక్ ల‌వ్‌స్టోరీ కూడా క‌రోనా కార‌ణంగా వాయిదా త‌ప్ప‌లేదు. అయితే మేక‌ర్స్ మార్చి 18న సినిమాను విడుద‌ల చేస్తారు అని ప్ర‌చారం జ‌రుగుతుంది. కానీ దీనిపై మేక‌ర్స్ ఎలాంటి క్లారిటీ మాత్రం ఇవ్వ‌లేదు.

Visitors Are Also Reading