Home » Oct 8th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Oct 8th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

హైద‌రాబాద్ లో మావోయిస్టు మ‌హిళా నేత ఆలూరి ఉషారాణి డీజీపీ ఎదుట లొంగిపోయారు. ఉషారాణి తెనాలి ప్రాంతానికి చెందిన‌వారు. దండకారణ్య జోనల్‌ కమిటీ సభ్యురాలిగా ఉషారాణి ప‌నిచేశారు.

 

మహారాష్ట్ర లోని నాసిక్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్‌ బస్సులో మంటలు చెల‌రేగాయి. ప్ర‌మాదంలో 11 మంది సజీవదహనం అయ్యారు. 35 మందికి గాయాలయ్యాయి.

Advertisement

ఆత్మకూరు డీసీసీబీలో నిధుల గోల్‌మాల్ జ‌రిగింది. 500 మంది లబ్ధిదారుల పేరుతో రూ.కోట్లు పక్కదారి ప‌ట్టించారు. పలువురు రైతులకు అధికారులు నోటీసులు పంపించారు. రుణాలు తీసుకోక‌పోయినా నోటీసులు ఇవ్వ‌డం ఏంటని రైతులు ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు.

నేడు హైదరాబాద్‌కు మల్లికార్జున ఖర్గే విచ్చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌లో పార్టీ నేతలతో ఖర్గే సమావేశం కానున్నారు.

తమ దేశ పౌరులకు అమెరికా ట్రావెల్ అడ్వైజరీ జారీచేసింది. భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించవద్దని హెచ్చరిక చేసింది. లడ్డాక్, లేహ్ మినహా జమ్మూకాశ్మీర్‌లోని ఇతర ప్రాంతాల్లో పర్యటించొద్దని సూచించింది. మార్కెట్లు, మాల్స్, ప్రభుత్వ కార్యాలయాల వద్ద దాడులు జరిగే ఛాన్స్ ఉందని వార్నింగ్ ఇచ్చింది.

Advertisement

కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం విధించింది. మూడు రోజుల్లో సర్వీసులు నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసింది. నిబంధనలు పాటించనందుకు ప్రభుత్వం చర్యలకు సిద్దం అయ్యింది.


హైదరాబాద్‌లో మెట్రో సర్వీస్ వేళ‌ల్లో మార్పులు చేశారు. రాత్రి 11 గంటలకు ఆఖరి మెట్రో సర్వీస్ ఉండ‌నుంది. ఇక‌ ఈనెల 10 నుంచి కొత్త టైమింగ్స్ అమ‌లులోకి రానున్నాయి.

చంద్రుడిపై సోడియం పుష్క‌లంగా ఉంద‌ని ఇస్రో ప్ర‌క‌టించింది. సోడియం స్ప‌ష్ట‌మైన మ్యాప్ ను ఇస్రో గుర్తించింది.

జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి రెండో రోజు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. వాహ‌నాల కొనుగోలు కేసులో ప్ర‌భాక‌ర్ రెడ్డి విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. నిన్న 9 గంట‌ల పాటూ జేసీని ఈడీ విచారించింది.

దేశంలోనే మొద‌టిసారి కృష్ణాన‌ది పై రెండంత‌స్థుల ఎత్తులో కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం జ‌ర‌గ‌నుంది. సోమ‌శిల వ‌ద్ద కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానానికి కేంద్ర ఆమోదం తెలిపింది.

Visitors Are Also Reading