నేడు మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ రోజు నుండి ఈ నెల 14 తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరగనుంది.
Advertisement
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌కి అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడంగా ఆస్ట్రేలియా అవార్డు అందుకుంది. దేశంలోని 4సాగునీటి కట్టడాలకు ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించింది. తొలిస్థానంలో కాటన్ బ్యారేజ్ నిలిచింది. అడిలైడ్‌లో మంత్రులు అంబటి, కాకాని అవార్డులను అందుకున్నారు.
నేడు మాండ్య జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. భారత్ జోడో యాత్ర లో నేడు ప్రియాంక గాంధీ సైతం పాల్గొనబోతున్నారు.
లక్డీకాపూల్-అసెంబ్లీ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఓ వైపు పెద్ద సంఖ్యలో వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వస్తుంటే మరోవైపు ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనానికి దుర్గమ్మ విగ్రహాలు తీసుకెళుతున్నారు.
Advertisement
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం నెలకొంది. కరీంనగర్, మానకొండూరు, సిరిసిల్ల, చొప్పదండి నియోజకరవర్గాల్లో భారీ వర్షం పడుతుంది. కుండపోత వర్షంతో నియోజకవర్గాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరింది. రాకపోకలకు అంతరాయం.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం జరిగింది. ఇంజిన్ ముందు భాగం బ్రేక్ అయ్యింది. గేదెల మంద అడ్డురావడంతో లోకో పైలట్ వేయడం తో ప్రమాదం చోటు చేసుకుంది.
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలు అవుతోంది అని ప్రాప్ టైగర్ సంస్థ నివేదికలో వెల్లడించింది. నిర్మాణాలు విపరీతంగా పెరిగిపోతుంటే కొనుగోలు దారులు తగ్గిపోతున్నారు అని నివేదికలో పేర్కొన్నారు.
2025 నాటికి చంద్రుడి పై మొక్కలు పెంచాలని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. దానికోసం ఇప్పటికే ఓ గడ్డి జాతి మొక్కను ఎంపిక చేశారు.