Home » Oct 27th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Oct 27th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

కోయంబత్తూరు కారు పేలుడు కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఏడు అనుమానిత కార్లను పోలీసులు సీజ్‌ చేసారు.

Ap cm jagan

Ap cm jagan

నేడు నెల్లూరు జిల్లా నేలటూరులో సీఎం జగన్‌ పర్యటిస్తున్నారు. జెన్‌కో మూడో థర్మల్‌ పవర్‌ యూనిట్‌ను సీఎం ప్రారంభించనున్నారు. ఆనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు.

Advertisement

ప్రగతి భవన్‌లోనే నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం. ఉదయం 11 గంటల తర్వాత సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ ఉండే అవకాశం ఉంది. బేరసారాలకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని ఎమ్మెల్యేలు చెబుతున్నారు.

తెలంగాణలో రెండో రోజు రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర సాగుతోంది. నారాయణపేట మక్తల్‌ శివారులోని సబ్‌ స్టేషన్‌ నుంచి యాత్ర ప్రారంభం కానుంది. ఇవాళ 26.7 కిలోమీటర్ల పాదయాత్ర జరగనుండగా బండ్లగుంటలో లంచ్‌ బ్రేక్‌ తరవాత రాత్రి గుడిగండ్లలో రాహుల్ గాంధీ బస చేయనున్నారు.

Advertisement

ఎమ్మెల్యేలను కొనుగోలు అంశం పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యేలను కొనాల్సిన పని మాకేంటి? అన్నందకుమార్ ఎవరో నాకు తెలీదు.. మునుగోడులో గెలవడం కోసమే కుట్ర చేస్తున్నారు అంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

నయనతార-విఘ్నేష్ కవల పిల్లల విషయంలో చట్టబద్ధంగానే జరిగిందని ఆరోగ్యశాఖ నివేదిక అందించింది. సరోగసీ విషయంలో నిబంధనలు ఉల్లంఘించలేదని పేర్కొంది. 2016 మార్చిలో నయనతార-విఘ్నేష్ వివాహం వివాహం చేసుకున్నారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సరోగసి ప్రక్రియ జరిగింది.

రాయలసీమను చలి వణికిస్తోంది. చిత్తూరు, అనంతపురం సహా కొన్ని జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

బాలీవుడ్ నిర్మాత కమల్ కిషోర్ మిశ్రా తన భార్యను కారుతో తొక్కించే ప్రయత్నం చేశారు. దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Visitors Are Also Reading