బీజేపీకి రాపోలు ఆనంద్ భాస్కర్ రాజీనామా చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఆనంద్ రాజీనామా లేఖను పంపించారు. ఆయన టీఆర్ఎస్లో చేరనున్నట్టు సమాచారం.
తెలంగాణలో ఆగని లోన్ యాప్ ఆగడాలు. రాష్ట్రంలో 9 నెలల్లో 150 లోన్ యాప్ కేసులు నమోదయ్యాయి. కొంతమంది చైనా దేశస్తులను అరెస్ట్ చేసినా, కాల్ సెంటర్లు మూసివేసినా ఆగడాలు మాత్రం అదుపుకావడం లేదు.
Advertisement
ఏపీలోని తాడేపల్లిలో కాసేపట్లో వైసీపీ బీసీ ఆత్మీయ సమావేశం జరగనుంది. రాష్ట్ర రీజనల్ కో-ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి నేతృత్వంలో భేటీ కానున్నారు. బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ భేటీలో పాల్గొనే అవకాశం ఉంది.
మంచిర్యాలలో అర్ధరాత్రి ఎస్సై తిరుపతి వీరంగం సృష్టించారు. మద్యం సేవించి నడిరోడ్డుపై హంగామా చేశారు. పోలీసులు ప్రశ్నిస్తే వారిపైకి ఎస్సై దాడికి దిగారు. స్థానికులు అడ్డుకోవడంతో కారు వదిలి పరార్ అయినట్టు సమాచారం.
Advertisement
నయనతార దంపతుల సరోగసి వివాదంపై విచారణ పూర్తయ్యింది. నేడు ప్రభుత్వానికి విచారణ కమిటీ నివేదిక ఇవ్వనుంది.
నేడు వృద్ధులు, దివ్యాంగుల కోటా కింద టీటీడీ దర్శన టోకెన్లు విడుదల చేస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు నవంబర్ కోటా కింద దర్శన టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది.
కార్తీక మాసం ప్రారంభంతో భక్తులు శివాలయాలకు పోటెత్తుతున్నారు. భక్తులతో గోదావరి ఘాట్లు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారు జామునుంచే గోదావరిలో భక్తుల పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు చేస్తున్నారు.
నేడు రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి హెలికాప్టర్లో తెలంగాణకు వస్తున్నారు. సాయంత్రం 5 గంటల లోపు రాహుల్ గాంధీ మక్తల్ చేరుకోనున్నారు.