Home » రూల్‌బుక్‌ను మెయింటైన్ చేసిన త‌ల్లి.. ఆశ్య‌ర్యానికి గురైన బంధువులు

రూల్‌బుక్‌ను మెయింటైన్ చేసిన త‌ల్లి.. ఆశ్య‌ర్యానికి గురైన బంధువులు

by Anji
Ad

త‌ల్లి కావ‌డం అనేది ప్ర‌తి మ‌హిళ క‌ల‌. ఒక మ‌హిళ త‌ల్లి అయితే.. త‌న బిడ్డ‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటుంది. బిడ్డ ర‌క్ష‌ణ‌కు సంబంధించిన అంశంలో ఏమాత్రం కాంప్ర‌మైజ్ అవ్వ‌దు. బిడ్డ సుర‌క్షితంగా ఉండడం కోసం ఏమి చేసేందుకు అయినా వెనుకాడ‌దు ఆ త‌ల్లి. తాజాగా ఇలాంటి వార్త ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. యూనైటేడ్ కింగ్‌డ‌మ్ లోని లండ‌న్‌లో నివ‌సిస్తున్న లోలా జిమెనేజ్ ఇటీవ‌ల ఓ పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.

New mother set strict rules for people visiting baby kisses not allowed मां  बनने के बाद महिला ने बनाई एक रूलबुक, शर्ते पूरी करने वाला ही मिल पाता हैं  बच्चे से -

Advertisement

ఆ బిడ్డ‌ను చూసేందుకు వ‌చ్చిన బంధువులు, స్నేహితులు, స‌న్నిహితులు ఆస‌క్తి క‌న‌బ‌రిచారు. అయితే త‌న బిడ్డ‌ను చూసేందుకు వ‌చ్చే అతిథుల కోసం ఆ త‌ల్లి పెద్ద రూల్ బుక్స్‌ను సిద్ధం చేసింది. ఇంటికి వ‌చ్చే వారు ఎవ‌రైనా.. ఈ నియ‌మాలు పాటించాల్సిందేన‌ని కండీష‌న్లు పెట్టింది. క‌రోనా ప్ర‌బ‌లుతున్న స‌మ‌యంలో త‌న బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ త‌రుణంలో బిడ్డ‌ను జాగ్ర‌త్త‌గా కాపాడుకునేందుకు.. బిడ్డ‌కు క‌రోనా సోక‌కుండా ఉండేందుకు ఈ రూల్స్ సిద్ధం చేసిన‌ది.

Advertisement

New Mother set strict rules for people visiting baby kisses not allowed  pratp - मां ने बनाए घर आने वाले मेहमानों के लिए नियम, बच्चे से मिलना है  पूरी करनी होंगी सभी

త‌న బిడ్డ‌ను చూడ‌డానికి వ‌చ్చే వారు ఎవ‌రైనా స‌రే ఈ రూల్స్ పాటించాల్సిందే అంటూ ఇంటి ముందు ఒక బోర్డును కూడా ఏర్పాటు చేసింది. అంతేకాదు ఆ నిబంధ‌న‌ల జాబితాను సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. త‌న బిడ్డ‌ను క‌రోనా నుంచి దూరంగా ఉంచేందుకు ఈ నియ‌మాల‌ను స్ప‌ష్టం చేసింది. ఆమె రూపొందించిన రూల్ బుక్ ప్ర‌కారం.. ఆమె కుటుంబ స‌భ్యులు, స్నేహితులు త‌ప్ప మ‌రెవ్వ‌రినీ ఇంట్లోకి రావ‌డానికి వీలులేదు. ఈ స‌మ‌యంలో ఇంటికొచ్చే ఏ అతిథి అయినా త‌మ బూట్లపై దుస్తుల‌ను తొల‌గించాలి. అదేవిధంగా శానిటైజ్ చేసుకోవాలి. ఎవ‌రైనా త‌న ఇంటికి వ‌స్తే క‌రోనా ప‌రీక్ష చేయించుకుని నెగిటివ్ రిపోర్ట్ చూపించాల్సి ఉంటుంది. దీంతో పాటు ఇంట్లో దూమ‌పానం కూడా నిషేదం. అతిథి కూడా పిల్ల‌వాడి ద‌గ్గ‌రికి రావ‌డం కానీ, ముట్టుకోవ‌డం లాంటివి కుద‌ర‌దు అని చెప్పింది.

Visitors Are Also Reading