Home » ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేసిన “నువ్వే కావాలి” కథతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన తరుణ్… ఆ ఇద్దరు హీరోలు వీరే..!

ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేసిన “నువ్వే కావాలి” కథతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన తరుణ్… ఆ ఇద్దరు హీరోలు వీరే..!

by AJAY
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు గుర్తింపు కలిగిన నటుల్లో ఒకరు అయినటువంటి తరుణ్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అప్పటివరకు ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న తరుణ్ “నువ్వే కావాలి” మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీని ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించగా… స్రవంతి రవికిషోర్ ఈ మూవీకి ఎక్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించాడు.

Advertisement

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి రచయిత గా వ్యవహరించగా… కోటి ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఈ మూవీలో తరుణ్ కు జోడిగా రిచా హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ 13 అక్టోబర్ 2000 సంవత్సరం విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షోకే బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ అప్పటివరకు ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీ కలెక్షన్స్ రికార్డులన్నింటిని దాటేసి ఇంట్రెస్ట్ హిట్ గా నిలిచింది.

nuvve-kaavali

Advertisement

ఈ మూవీ ద్వారా తరుణ్ కు రీచాకు అదిరిపోయే రేంజ్ లో క్రేజ్ పెరిగిపోయింది. ఇలా భారీ కలక్షన్లను వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ మూవీలో మొదటగా హీరోగా చిత్ర బృందం తరుణ్ ను అనుకోలేదట. అంతకుముందే ఇద్దరు హీరోలను అనుకుంటే ఆ ఇద్దరు హీరోలు కూడా ఈ మూవీలో నటించకపోవడంతో ఈ మూవీలో తరుణ్ ను హీరోగా తీసుకున్నారట. ఆ హీరోలు ఎవరు..? ఎందుకు ఈ మూవీని వద్దనుకున్నారో తెలుసుకుందాం.

 

ఈ మూవీ కథ మొత్తం తయారు అయిన తర్వాత ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలి అని మూవీ బృందం అందుకుందట. అందులో భాగంగా మహేష్ ను కూడా చిత్ర బృందం సంప్రదించి కథను వినిపించగా… ఆ తర్వాత ఎన్ని రోజులు అయినా మహేష్ నుండి రెస్పాన్స్ రాకపోవడంతో ఇదే కథను సుమంత్ కు వినిపించారట.

సుమంత్ కు ఈ కథ బాగా నచ్చినప్పటికీ అదే సమయంలో ఇతర మూవీలలో సుమంత్ బిజీగా ఉండడం వల్ల ఈ మూవీలో నటించలేను అని చెప్పేశాడట. దానితో తరుణ్ ను ఈ మూవీ బృందం సంప్రదించగా తరుణ్ ఈ మూవీలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అలా మహేష్… సుమంత్ రిజెక్ట్ చేసిన కథతో తరుణ్ ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు.

Visitors Are Also Reading