Home » ఆ ద‌ర్శ‌కుడితో ఎన్టీఆర్ సినిమా ఫిక్స్‌.. హీరోయిన్ ఎవ‌రంటే..?

ఆ ద‌ర్శ‌కుడితో ఎన్టీఆర్ సినిమా ఫిక్స్‌.. హీరోయిన్ ఎవ‌రంటే..?

by Anji
Ad

ఆర్ఆర్ఆర్ సినిమా విజ‌యం తర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొర‌టాల సినిమా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. కానీ ఆ సినిమా ప‌ట్టాలపైకి ఎక్క‌డం లేదు. మ‌రే సినిమా తీయ‌డం లేదు. దీంతో అభిమానులు చాలా నిరుత్సాహంగా ఉన్నారు.

Advertisement

మ‌రోవైపు కొరటాల శివ‌- ఎన్టీఆర్ కాంబోలో వ‌చ్చే సినిమా ర‌ద్ద‌యింది అంటూ కూడా రూమ‌ర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల విడుదలైన పోస్టర్ ఎన్టీఆర్ మరింత పవర్ ఫుల్ లుక్ లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్ట్ గురించి తాజాగా మరో క్రేజీ అప్డేట్ నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.

Also Read : హ‌న్సిక పెళ్లికి ముహూర్తం ఖ‌రారు.. వ‌రుడు ఎవ‌రంటే..

Advertisement

ద‌ర్శ‌కుడు హను రాఘవపూడి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఓ స్క్రిప్ట్ ను వినిపించారని, ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే వీరి కాంబో అప్డేట్ అఫీషియల్ అనౌన్స్ చేయనున్నారట. ఇక ఇటీవల సీతా రామం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న హను ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా చేస్తుండడంతో అభిమానులలో మ‌రింత క్యూరియాసిటీని పెంచేసింది. . హను తన సీతారామం బ్లాక్ బస్టర్ విజయంతో మంచి ఫామ్ లో ఉన్నాడు. సున్నితమైన ఎమోషన్ ఉన్న సినిమాలు తీసి హను ప్రసిద్ధి చెందాడు. ఇలాంటి డైరెక్టర్ మాస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ కి స్క్రిప్టుని వినిపించ‌డం కాస్త‌ ఆసక్తికరమైన విషయం. ఇంకా ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ తెలుగు తెరకు పరిచయం అవుతారని టాక్ఈ వినిపిస్తోంది. ఇందులో వాస్త‌వం ఎంత అనేది త్వ‌ర‌లోనే తేల‌నుంది.

Also Read : వీకెండ్ బ‌రిలో 7 చిన్న సినిమాలు….ఆ సినిమాలు ఏవంటే..?

 

Visitors Are Also Reading