Home » మ‌హ‌నీయుడు ఎన్టీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన 10 అద్భుత‌మైన ప‌థ‌కాలు..!

మ‌హ‌నీయుడు ఎన్టీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన 10 అద్భుత‌మైన ప‌థ‌కాలు..!

by AJAY
Published: Last Updated on
Ad

అన్న‌గారు ఎన్టీరామారావు న‌టుడుగానే కాకుండా రాజ‌కీయాల్లోనూ చ‌క్రం తిప్పారు. ముఖ్యమంత్రిగా ఆయ‌న తెలుగు ప్ర‌జ‌ల‌కు చేసిన సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివి. ఎన్ని అవాంత‌రాలు ఎదురైనా తెలుగు ప్ర‌జ‌ల‌కోసం న‌మ్మ‌కున్న కార్య‌క‌ర్త‌ల కోసం ధైర్యంగా అన్యాయాల‌ను ఎదిరించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన త‌ర‌వాత అద్భుత‌మైన ప‌థ‌కాల‌ను తీసుకువ‌చ్చారు. ఇప్ప‌టికీ ఆ ప‌థ‌కాలు ర‌క‌ర‌కాల పేర్ల‌తో అమ‌లు చేయ‌డంతో పాటూ ఆ ప‌థ‌కాలను అప్ప‌ట్లోనే ఇత‌ర రాష్ట్రాలు కూడా కాపీకొట్టాయి.

Also Read:  వీడియో పై సెటైర్ …. నెటిజన్ కు దిమ్మ తిరిగిపోయే రిప్లై ఇచ్చిన దేతడి హారిక….!

Advertisement

అలా ఎన్టీఆర్ తీసుకువ‌చ్చిన ప‌ది అద్భుత‌మైన ప‌థ‌కాలు ఏవో ఇప్పుడు చూద్దాం….1983లో ఎన్టీఆర్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర‌వాత 2రూపాల‌య‌ల‌కే కిలో బియ్యంప‌థకాన్ని తీసుకువ‌చ్చి పేద ప్ర‌జ‌ల క‌డుపునింపారు. అంతే కాకుండా ప్ర‌భుత్వాలకే ఆదాయ‌క‌రం అయిన‌ప్ప‌టికీ తాగుడు వ‌ల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయ‌న్న ఉద్ద్యేశ్యంతో మ‌ద్య‌పానాన్ని నిశేదించారు. ఇంట‌ర్ త‌ర‌వాత ఇంజ‌నీరింగ్, డాక్ట‌ర్ అవ్వాలంటే ఎంసెట్ రాయాలి. ఎసెంట్ ప‌రీక్ష‌ను కూడా ఎన్టీఆర్ హ‌యాంలోనే తీసుకువ‌చ్చారు.

Advertisement

అంతే కాకుండా ప‌టేల్ ప‌ట్వారీ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేసి గ్రామ భూముల‌ను రెవెన్యూ ప‌రిధిలోకి తీసుకువ‌చ్చారు. నిజాంకాలంలో ప్రారంభించిన ఎంజీబీఎస్ బ‌స్టాండ్ ను ఎన్టీఆర్ హ‌యాంలోనే పూర్తిచేశారు. హుస్సేన్ సాగ‌ర్ లో బుద్ద విగ్ర‌హం….నెక్లెస్ రోడ్డులో మ‌హ‌నీయుల విగ్రహాల‌ను కూడా ఎన్టీఆర్ హ‌యాంలోనే ఏర్పాటు చేశారు. ప్ర‌భుత్వానికి వృథా ఖ‌ర్చు అని భావించి శాస‌న‌మండలినే ర‌ద్దు చేయ‌గా అది విప్ల‌వాత్మ‌క నిర్న‌యం అయ్యింది. అదే విధంగా ఎన్టీఆర్ హయాంలో పేద ప్ర‌జ‌ల కోసం 5 ల‌క్ష‌ల ఇళ్ల‌ను నిర్మించి పేద‌వారికి గూడు ను ఇచ్చారు. ఇది చ‌రిత్ర‌లో నిలిచిపోయిన ప‌థ‌కం అయ్యింది.

స్కూల్ ల‌లో మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చింది కూడా అన్న‌గారే. స్కూల్ ల‌లో ఈ ప‌థ‌కం అమ‌లు చేయ‌డం ద్వారా ఆక‌లి తీర్చ‌డంతో పాటూ చ‌దువుకునే విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది. స్థానిక‌సంస్థ‌ల ఎన్నిక‌ల‌లో రిజ‌ర్వేష‌న్ సిస్టం తీసుకువ‌చ్చింది కూడా ఎన్టీఆర్ గారే. అంతే కాకుండా చిత్ర‌ప‌రిశ్ర‌మ చెన్నై నుండి హైద‌రాబాద్ కు తీసుకురావ‌డానికి అన్న‌గారు కృషి చేశారు.

ALSO READ : వాట్సాప్ యూజర్ల కోసం మరో ఫీచర్.. ఇక నుంచి  గూగుల్ డ్రైవ్ అవసరం లేదు..!

Visitors Are Also Reading