సినిమా ఇండస్ట్రీలో వారసత్వం ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని ఫ్యామిలీల నుండి హీరోలు ఉన్నారు. అయితే అందరు సీనియర్ హీరోల కుమారులు దాదాపు హీరోలుగా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కానీ కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ తన ఇద్దరు కుమారులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. మొదట కృష్ణ తన పెద్ద కుమారుడు రమేష్ బాబును ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.
Also Read: 30 ఏళ్ల తరువాత బాలకృష్ణకి ఆ లోటు తీరిందా..?
Advertisement
ఆ తరవాత మహేశ్ బాబును ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. రమేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ సక్సెస్ అవ్వలేకపోయాడు. ఆ తరవాత నిర్మాతగా చేసినా కూడా సక్సెస్ అందుకోలేదు. కానీ మహేశ్ బాబు మాత్రం స్టార్ హీరో అయ్యాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. అయితే రమేష్ బాబును ఇండస్ట్రీకి పరిచయం చేయాలని సూచించింది మాత్రం ఏఎన్ఆర్ గారు.
Also Read: ఆ తప్పు చేసిందని ఇలియానాను టాలీవుడ్ లో తొక్కేశారా..? తెరవెనక జరిగిందేంటి..?
Advertisement
ఇక ఏఎన్ఆర్ తన కుమారుడు నాగార్జున ను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏఎన్ఆర్ అన్నగారు ఎన్టీఆర్ ను చూసి తన కుమారులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. మొదట హీరోగా ఎంతో సక్సెస్ అయిన ఎన్టీఆర్ తన కుమారులను నిర్మాతలుగా హీరోలుగా పరిచయం చేశాడు. అప్పటి వరకూ టాలీవుడ్ లో వారసత్వాలు రాలేదు. ఎన్టీఆర్ గారే వారులసులను పరిచయం చేయడానికి నాంది పలికారు. ఆ సమయంలో కొంతమంది విమర్శలు కూడా చేశారు.
కానీ టాలెంట్ ఉన్న వాళ్లు సక్సెస్ అవుతారని నమ్మిన ఎన్టీఆర్ బాలయ్య, హరికృష్ణలను హీరోగా పరిచయం చేశారు. అంతే కాకుండా మరో ఇద్దరు కుమారులను నిర్మాణరంగంలోకి దింపారు. అలా పరోక్షంగా కృష్ణ తన కుమారులను ఇండస్ట్రీకి పరిచయం చేసేలా సహాయపడ్డారు. ఇక నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోల ఎంట్రీకి కూడా అన్నగారే పరోక్షంగా కారణం అయ్యారని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
Also Read: సూపర్ స్టార్ కృష్ణ నటించిన టార్జాన్ మూవీ ఏదో తెలుసా..?