Home » ఆ హీరో కృష్ణుడి వేషం వేయాల‌ని ఆ ముఖ్య‌మంత్రితో రిక‌మెండ్ చేయించిన ఎన్టీఆర్

ఆ హీరో కృష్ణుడి వేషం వేయాల‌ని ఆ ముఖ్య‌మంత్రితో రిక‌మెండ్ చేయించిన ఎన్టీఆర్

by Anji
Ad

తెలుగు సినిమాకు రెండు క‌ళ్ల‌లా వ్య‌వ‌హ‌రించిన అగ్ర‌తార‌లు నంద‌మూరి తార‌క‌రామారావు, అక్కినేని నాగేశ్వ‌ర‌రావు సినిమాల విష‌యంలో వీరిద్ద‌రూ పోటీ ప‌డి న‌టించేవారు. ఆ స‌మ‌యంలో వీరు క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చాలానే చేశారు. పౌరాణిక పాత్ర‌ల‌కు పెట్టింది పేరు ఎన్టీఆర్. తెలుగు వారికి వెండితెర‌పై రాముడు, కృష్ణుడు, అంటే గుర్తుకొచ్చే నిండైన రూపం ఎన్టీఆర్ ది. అలాంటి ఆయ‌న ఏఎన్నార్ ను పిలిచి కృష్ణుడిగా న‌టించ‌మ‌ని అడిగార‌ట‌. అందుకు ఏఎన్నార్ సున్నితంగా తిర‌స్క‌రించారట‌.

Advertisement

అప్ప‌టి సీఎం జ‌ల‌గం వెంగ‌ళ్‌రావుతో సైతం ఎన్టీఆర్ రిక‌మెండ్ చేయించార‌ట‌. అయినా ఏఎన్నార్ మాత్రం ఒప్పుకోలేదు. ఓ సంద‌ర్భంలో ఈ విష‌యం గురించి ఏఎన్నార్ స్వ‌యంగా ఇలా వెల్ల‌డించారు.ఎన్టీఆర్ సినీ రంగ ప్ర‌వేశం చేసిన‌ప్పుడే ఏఎన్నార్ ప‌ని అయిపోతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కొంద‌రూ నిర్మాత‌లే నేరుగా నాతో చెప్పారు. ఎందుక‌న‌గా నా క‌న్నా ఆయ‌న ఎత్తు గంభీరంగా ఉంటారు. వాయిస్ కూడా బాగుంటుంది. ప్ర‌తిభ కూడా ఉన్న‌ది. నాకు కేవ‌లం టాలెంట్ మాత్ర‌మే ఉంది. ఇద్ద‌రికీ మార్కులేస్తే ఆయ‌న‌కే ఎక్కువ ప‌డ‌తాయి. రావణాసూరుడు చెడ్డ‌వాడ‌ని రామాయ‌ణం చెబుతుంటే అలాంటి పాత్ర‌ను వేసి స‌మ‌ర్థుడు అనిపించుకున్నారు.

Advertisement

దుర్యోధ‌నుడు, దుర్మార్గుడు అని భార‌తం చెబుతుంటే ఆ పాత్ర‌ను గుర్తుండిపోయేలా చేసారు. అది ఆయ‌న ప‌ర్స‌నాలిటీ ఒక‌వేళ ఆయ‌న‌ను చూసి నేను అలాంటి పాత్ర‌లు వేస్తే ర‌క్తి క‌ట్ట‌వు. ఒక‌సారి న‌న్ను పిలిచి క‌ర్ణుడి వేషం వేయ‌మ‌ని అడిగారు. వేయ‌న‌ని చెప్పాను. అదేవిధంగా చాణ‌క్య చంద్ర‌గుప్త‌లో చంద్ర‌గుప్తుడి వేషం వేయ‌మ‌న్నారు. అందుకు నేను ప‌నికి రాను. చాణక్యుడి వేషం వేస్తాన‌ని చెప్పాను. ఎందుకంటే చంద్ర‌గుప్త మ‌హారాజు ఆహార్యం నాకు లేదు. చాణ‌క్యుడు తెలివైన వాడు అని, అలాంటి పాత్ర నాకు స‌రిపోతుంద‌ని చెప్పుకొచ్చాడు ఏఎన్నార్‌.

ఇక ఈ సినిమా కంటే ముందే కృష్ణుడు వేషం వేయాల‌ని ఎన్టీఆర్ అడిగారు. ఎందుకంటే ఆ పాత్ర‌కు ఆయ‌న పాపుల‌ర్. న్యాయంగా అయితే కృష్ణుడి పాత్ర‌కు నేను బెట‌ర్. ఎందుకంటే కృష్ణుడు అజానుబాహుడు. అర‌వింద ద‌ళ‌యాతాక్షుడు అని ఎక్క‌డ లేదు. పైగా చిలిపివాడు చ‌మ‌క్కులున్న‌వాడు. మాయ మ‌రాఠీ ఇలాంటి వేషాల‌కు నేను ప‌నికొస్తాను. కానీ అప్ప‌టికే కృష్ణుడిగా ఆయ‌న పాపుల‌ర్ కాబ‌ట్టి నేను ఆ పాత్ర‌ల్లోకి వెళ్లలేదు. కృష్ణుడి పాత్ర చేయ‌మ‌ని సీఎం జ‌ల‌గం వెంగ‌ళ‌రావుతో రిక‌మెండ్ చేయించారు. ఇక ఆయ‌న‌తో కూడా చేయ‌ను అని చెప్పాను. ఆ త‌రువాత చాణ‌క్య చంద్ర‌గుప్త వేషం వేసేందుకు ఒప్పుకున్నాను. న‌ట‌న విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య పోటీ ఉన్న‌ప్ప‌టికీ నా ఆహార్థం వాచ‌కానికి త‌గ‌ని పాత్ర‌ల‌ను నేను ఎప్పుడు చేయ‌లేను. అంజ‌లిదేవి, సావిత్రి తరువాత నా కెరీర్‌లో ఎక్కువ సినిమాకు ప‌ని చేసిన కో స్టార్ ఎన్టీఆర్‌- ఏఎన్నార్ అని చెప్పారు. ఎన్టీఆర్ -ఏఎన్నార్‌లు త‌మ సినీ కెరీర్‌లో 15 చిత్రాల‌కు పైగా క‌లిసి న‌టించారు.

Also Read : 

ఎన్టీఆర్ చాలా ఇష్ట‌ప‌డే వెజ్ వంట‌కం ఇదే.. ఆ హీరోయిన్ల‌కు కూడా రుచి చూపించేవార‌ట‌..!

Visitors Are Also Reading