Home » కేంద్ర హోంశాఖ మంత్రిని మీట్ అవ్వనున్న ఎన్టీఆర్… కారణం ఏమిటి…?

కేంద్ర హోంశాఖ మంత్రిని మీట్ అవ్వనున్న ఎన్టీఆర్… కారణం ఏమిటి…?

by Sravya
Ad

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా పనిలో ఉన్నారు. ఈ విధంగా షూటింగ్ పనులతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నా కూడా త్వరలోనే హోంశాఖ మంత్రిని ఆయన కలవబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజాగా ఒక వార్త వైరల్ అవుతోంది. అమిత్ షా ని జూనియర్ ఎన్టీఆర్ కలవబోతున్నారని అంతా అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో శాసనసభ ఎన్నికల్లో జరగబోతున్నటువంటి నేపథ్యంలో పలువురు మంత్రులు తెలంగాణ వచ్చి సందడి చేస్తున్నారు.

Flexis Of Jr. NTR In AP Creates quite A Political Stir

Advertisement

ఈ క్రమంలోనే తెలంగాణలో బిజెపి పార్టీని బలపరచడం కోసం పలు పార్టీలతో పొత్తుకుదురుచుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ జనసేనతో కలిసి ఎన్నికల బరిలోకి దిగాలని పవన్ కళ్యాణ్ టిడిపి తో పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అయితే అమిత్ షా ని ఎందుకు ఎన్టీఆర్ కలవబోతున్నారు అనే దాని గురించి ప్రతి ఒక్కరు ఆరా తీస్తున్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు.

చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినా కూడా రియాక్ట్ కాలేదు మరి ఎందుకు ఎన్టీఆర్ అమిత్ షా ని మీట్ అవబోతున్నారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో మునుగోడు ఎన్నికల సమయంలో కూడా హైదరాబాద్ నోవొటెల్ హోటల్లో అమిత్ షా ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు అరగంట పాటు వీళ్ళిద్దరూ సమావేశంలో పాల్గొన్నారు మళ్ళీ ఈ క్రమంలో ఎన్టీఆర్ భేటీ కానున్నారు రాజకీయపరమైన అంశాలను ప్రస్తావించడం కోసమే అని వార్తలు వస్తున్నాయి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading