బాపు దర్శకత్వంలో NTR నటించిన తొలి చిత్రం శ్రీరామాంజనేయ యుద్దం (1975). ఈ సినిమాకు నిర్మాతలు పొట్లూరి వెంకటనారాయణరావు, యన్.బి.కె.ఉమామహేశ్వరరావు.
Advertisement
ఈ సినిమా ముహుర్తం రోజు NTR వేరే సినిమా పూర్తిచేసే పనిలో ఉన్నారట! నిజానికి నిర్మాతకి NTR ఇచ్చిన డేట్స్ లో ఈ ముహూర్తం డేట్ లేదు, అయినా మంచి రోజు, ముహూర్తం షాట్ ఒక్కటీ తీస్తే చాలని నిర్మాతలు అనుకుంటున్నారని దర్శకుడు బాపూ NTRతో చేప్తే…ఆయన సరే వస్తా అన్నారట!
Advertisement
అన్నమాట ప్రకారమే వచ్చి, రాముడి గెటప్ వేసుకున్నారు. తొలిషాట్ మేలుకో శ్రీరామ పాట తీయడం కోసం NTR ను పడుకోమన్నారు.NTR పడుకున్నాడు. షాట్ ఒకే అని దర్శకుడు బాపూ అరిచాడు. అయినా NTR లేవలేదు. మరోసారి అరవబోతుండగా అదే సినిమాలో హీరోయిన్ గా నటించిన సరోజాదేవి వచ్చి ఆయన నిద్రపోతున్నారు,సన్నగా గురక వినిపిస్తోందని బాపుతో అన్నారట! ఈ సినిమా కోసం వేరే సినిమాల షూట్స్ అన్నీ కంప్లిట్ చేసి వచ్చారు కాబట్టి అలసిపోయారు. లేపకండి కాసేపు పడుకోనివ్వండి అన్నారట సరోజదేవి! దాంతో షూటింగు ప్యాక్ అప్ చెప్పి అందరూ సైలెంట్ గా బయటకు వచ్చేసారట…ఓ గంట నిద్రపోయాక లేచి ఇంటికెళ్ళిపోయారట NTR!
Source : Rangavajhala Bharadwaja