Home » ఎన్టీఆర్ యాక్టింగ్ కి పడిపోయా.. ఖచ్చితంగా ఆ అవార్డు ఇవ్వాలంటున్న శిల్పశెట్టి..!!

ఎన్టీఆర్ యాక్టింగ్ కి పడిపోయా.. ఖచ్చితంగా ఆ అవార్డు ఇవ్వాలంటున్న శిల్పశెట్టి..!!

by Sravanthi Pandrala Pandrala

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తన పెర్ఫార్మెన్స్ తో ఎందరినో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా పులి తో చేసే సన్నివేశం కానీ, ఇంటర్వెల్ కి ముందు వచ్చేటువంటి ఎనిమల్స్ ఎటాక్ కానీ ఎంతో అద్భుతంగా ఉంటుంది. వాటిని చూసి ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేశారు. అలాగే ఈ సినిమాలో మేజర్ హైలైట్స్ ఇంకా చాలానే ఉన్నాయి. అలాగే ఎన్టీఆర్ రామ్ చరణ్ దోస్తీ సాంగ్ కానీ, ఆ తర్వాత క్లైమాక్స్ ఎపిసోడ్ కానీ చాలా అద్భుతం గా ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించిన ఈ చిత్రం ఇప్పటికే వెయ్యి కోట్లు వసూలు చేసి ఇంకా ముందుకు వెళుతుంది.

 

ఎన్టీఆర్ నటనకు అందరూ ఫిదా అయిపోతున్నారు. ఇప్పటికే ఎంతో అద్భుతంగా ఈ సినిమాకు సంబంధించి వ్యూస్ కానీ,రివ్యూస్ కానీ వస్తూ ఉండగా బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ కి ఏకంగా భారతరత్న ఇవ్వాలంటూ కామెంట్ చేశారు. సౌత్ ఇండియాలో కూడా ఆమె అడపదడపా రెండు మూడు సినిమాలు చేశారు. ఆ తర్వాత తమిళంలో కూడా చేశారు. అలాగే టాప్ హీరోయిన్ గా బాలీవుడ్ లో ఏకఛత్రాధిపత్యం వహించారు. ఒకానొక సందర్భంలో ఆమె కు పోటీ ఎవరూ లేరన్నారు.

ఇప్పుడు ఒక ఎన్నారై ని పెళ్లి చేసుకొని ఎంతో హ్యాపీగా తన లైఫ్ ని లీడ్ చేస్తోంది. అలాగా ఒక డాన్స్ రియాల్టీ షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది. మరి ఈ శిల్పాశెట్టి ఎన్టీఆర్ నటన చూసి ఫిదా అయిపోయిందట. తెలుగులో చాలా మంది హీరోలు ఆమెతో నటించాలని కోరుకుంటే ఇప్పుడు ఆమె మాత్రం ఎన్టీఆర్ గురించి పొగడడం, అందులోనూ ఎన్టీఆర్ నటన గురించి మరిచిపోలేని మాటలు చెప్పడం,భారతరత్న ఇవ్వాలంటూ పొగడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఇవి చ‌ద‌వండి :

కృష్ణ వ‌దిలేసిన ఈ సినిమా చిరంజీవికి లైఫ్ ఇచ్చింది!?

KGF-2 REVIEW RATING : కేజీఎఫ్-2 రివ్యూ & రేటింగ్….!

Visitors Are Also Reading