సినిమా ఇండస్ట్రీ అంటే గాసిప్ లకు కేరాఫ్ అడ్రస్ లాంటింది. కొన్ని జరిగిన విషయాలు వెలుగులోకి వస్తే చాలా అసలు జరగని విషయాలు కూడా వార్తల్లో చక్కర్లు కొడతాయి. అయితే ఈ గాసిప్ లు మొదలైంది ఇప్పుడు కాదు. బహుశా సినిమా పుట్టినప్పుడే గాసిప్ లు పుట్టాయామో…రెండుకు మించి ఎక్కువ సినిమాలు ఒకే హీరోయిన్ తో దర్శకుడు చేసినా హీరో చేసినా లేనిపోని వార్తలు పుట్టుకువస్తాయి.
Advertisement
అయితే అప్పట్లో స్వర్గీయ ఎన్టీరామారావు కూడా ఓ హీరోయిన్ తో ప్రేమాయణం నడిపించారని, పెళ్లి కూడా చేసుకోబుతున్నారని వార్తలు వినిపించాయి. ఇంతకీ ఆ వార్తలు నిజమైనవేనా లేదంటే గాసిప్సా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీరామారావు భార్య బసవతారకం గర్భవతిగా ఉన్నసమయంలో కృష్ణ కుమారితో ఓ సినిమా చేస్తున్నారట.
ఆ సమయంలో కృష్ణ కుమారికి ఎన్టీఆర్ ఆకర్షితులయ్యారు. అంతే కాకుండా ఆమెను వివాహం చేసుకోవాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఈ విషయాన్ని తన భార్య బసవతారకం కు కూడా చెప్పాగా మీకు ఇష్టమే నా ఇష్టం అని చెప్పారట. ఇక కృష్ణ కుమారి కూడా ఎన్టీఆర్ ను వివాహం చేసుకునేందుకు ఒప్పుకున్నారట. అయితే అప్పుడే ఓ కథ జరిగింది. ఎన్టీఆర్ మద్రాసులోని మురుగన్ దేవాలయంలో కృష్ణ కుమారిని వివాహం చేసుకునేందుకు సిద్దమయ్యారు. ఈ విషయాన్ని చిన్నాన్నకు తెలిపారు. చిన్నాన్న ఎన్టీఆర్ తో…. అరేయ్ నువ్వు అక్కడితోనే ఆగు…నేను వస్తున్నా అని చెప్పారు.
Advertisement
అనంతరం త్రివిక్రమరావు విజయవాడ కల్యాణ్ చక్రవర్తితో కలిసి వెంటనే బండి కట్టుకుని మద్రాసు బయలు దేరారు. ఆయన నేరుగా మద్రాసులోని కృష్ణ కుమారి ఇంటికి వెళ్లారట. అప్పటికే కృష్ణ కుమారి పెళ్లికి ముస్తాబై కూర్చుకున్నారు. అది చూసిన వెంటనే చిన్నాయన తన బొడ్లోని తుపాకి తీసి ఏంటి రామారావును పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. దానికి కృష్ణ కుమారి అవును దానిలో తప్పేముంది. ఆయన నాకు దగ్గరయ్యారు అని సమాధానం ఇచ్చింది. దాంతో చిన్నాయనకు కోపం వచ్చి…నీకు ఎవరు దగ్గరకాలేదు..నేను కాలేదా…సినిమాలు చేస్తున్నాం కాబట్టి దగ్గరవుతారు.
Also Read: కేజీఎఫ్-2 ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా ప్రభాస్..!
అంతే కానీ అలా దగ్గరైనవారందరినీ పెళ్లి చేసుకుంటావా అని అన్నారు. ఎన్టీఆర్ కోసం ఆంధ్రదేశం ఎదురుచూస్తుంది. ఆయనను దేవుడిలా ఆరాధిస్తుంది. ఇప్పుడు ఆయన రెండో పెళ్లి చేసుకుంటే ఏం కావాలి అంటూ ఫైర్ అయ్యారట. నువ్వు వెంటనే ఇక్కడ నుండి వెళ్లిపో..లేదంటే నిన్ను చంపి నేను చస్తానని చెప్పారు. దాంతో భయపడిన కృష్ణ కుమారి అక్కడ నుండి బెంగుళూరు వెళ్లిపోయారు. ఆ తరవాత చిన్నాయన ఎన్టీఆర్ కు కూడా క్లాస్ ఇచ్చారు. అలా ఎన్టీఆర్ కృష్ణ కుమారిల పెళ్లి ఆగిపోయింది. ఈ విషయాన్ని ప్రముక సీనియర్ దర్శకుడు ఇమంది రామారావు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Also Read: సినిమా కథకు ఏ మాత్రం తగ్గని రమా రాజమౌళిల ప్రేమకథ…ఎవరు ప్రపోజ్ చేశారంటే..!