Home » NTR తీసుకున్న ఈ నిర్ణ‌యం వ‌ల్ల మ‌హిళ‌లు రోడ్ల మీదికొచ్చి మరీ డాన్స్ చేశారు!

NTR తీసుకున్న ఈ నిర్ణ‌యం వ‌ల్ల మ‌హిళ‌లు రోడ్ల మీదికొచ్చి మరీ డాన్స్ చేశారు!

by Azhar
Ad

తెలుగు ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వం అంటూ పార్టీని స్థాపించి పెను సంచ‌లనాన్ని సృష్టించ‌డ‌మే కాకుండా అధికారం చేప‌ట్టిన NTR… పాల‌న‌లో కూడా అదే దూకుడును ప్ర‌ద‌ర్శించారు. త‌న‌దైన మార్క్ పాల‌న‌తో వాహ్ వా అనిపించాడు.

NTR ప్రవేశ పెట్టిన 10 అద్భుత ప‌థ‌కాలు:

Advertisement

  • 2/- KG బియ్యం :

1983 లో అధికారంలోకి రాగానే NTR తెచ్చిన ప‌థ‌కం 2/- KG బియ్యం! ఈ ప‌థ‌కాన్ని కేంద్ర ప్ర‌భుత్వం సైతం ప్ర‌శంసించింది.

 

  • సంపూర్ణ మ‌ద్య‌పాన నిషేదం
    కాయ‌క‌ష్టం చేసి సంపాదించిన సొమ్ము తాగుడుకే స‌రిపోతుంద‌న్న కార‌ణంతో సంపూర్ణ మ‌ద్య‌పాన నిషేద ప‌థ‌కాన్ని ప్రవేశ పెట్టాడు. మ‌హిళ‌లు అన్న‌గారి ఫోటో పెట్టి మ‌రీ సంబ‌రాలు చేసుకున్నారు.

  • EMCET
    EMCET రాసి ఇంజ‌నీరింగ్ లో జాయిన్ అవ్వాల‌నేది చాలా మంది క‌ల‌! ఆ EMCET ను స్టార్ట్ చేసిందే NTR.

  • ప‌టేల్ ప‌ట్వారీ విధానం ర‌ద్దు:
    ప‌టేల్ ప‌ట్వారీలు అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతూ పేదల భూముల‌ను త‌మ చేతిలో పెట్టుకొని తీవ్ర ఇబ్బందుల‌కు గురిచేశారు. ఒక్క సంత‌కంతో ఈ విధానాన్ని ర‌ద్దు చేసి పేద రైతుల‌కు ఆనందం పంచాడు.

Advertisement

  • MGBS బ‌స్ స్టాప్:
    మ‌హాత్మాగాంధీ బ‌స్ స్టేష‌న్…వాస్త‌వానికి నిజాం కాలంలో ఇమ్లీబ‌న్ బ‌స్టాండ్ ఉండేది. దాన్ని పెంచి పూర్తిస్థాయిలో MGBS ను తీర్చిదిద్దాడు. రాష్ట్రంలోని ప్ర‌తి ప‌ట్ట‌ణానికి ఇక్క‌డి నుండి బ‌స్ ఉండేలా చేశాడు.

 

  • హుస్సేన్ సాగ‌ర్ లో బుద్ద విగ్ర‌హం:
    నెక్లెస్ రోడ్డు చుట్టూ ఉన్న తెలుగు భాష‌ను, జాతిని జాగృతం చేసిన యోధుల‌ విగ్ర‌హాల‌ను ఏర్పాటు చేయించింది హుస్సేన్ సాగ‌ర్ లో బుద్ద విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసింది కూడా NTR యే.!

 

  • 5 ల‌క్ష‌ల ఇండ్ల నిర్మాణం:
    పేద‌ల‌కు ప‌క్కా ఇళ్ల నిర్మాణం చేయించి ఇవ్వాల‌న్న ఉద్దేశంతో త‌న 5 ఏళ్ల పాల‌న‌లో 5 ల‌క్ష‌ల ఇండ్ల‌ను నిర్మించి పేద‌ల క‌ళ్ల‌లో ఆనందాన్ని నింపాడు.

 

  • శాస‌న మండ‌లి ర‌ద్దు:
    శాస‌న మండ‌లిని నిర్వ‌హించ‌డం వృథా ఖ‌ర్చుగా భావించిన ఎన్టీఆర్ ఆ విధానాన్ని ర‌ద్దు చేశాడు. ఇదో విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యం….త‌ర్వాత రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఈ విధానానికి మ‌ళ్లీ స్టార్ట్ చేశాడు.

 

  • ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో మ‌ద్యాహ్న భోజ‌న ప‌థ‌కం :
    పేద విద్యార్థుల‌ను ప్రోత్సాహించేందుకు మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టాడు.

 

  • స్థానిక సంస్థ‌ల్లో రిజ‌ర్వేష‌న్స్: 

బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాలు రాజ‌కీయాల్లో ఎద‌గాల‌ని… స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో రిజ‌ర్వేష‌న్స్ ను ప్ర‌వేశ‌పెట్టాడు.

 

  • తెలుగు సినిమా ఇండ‌స్ట్రీని మ‌ద్రాస్ నుండి హైద్రాబాద్ కు త‌ర‌లింపు:
    మ‌ద్రాస్ కేంద్రంగా న‌డుస్తున్న తెలుగు సినీ ఇండ‌స్ట్రీని హైద్రాబాద్ కు త‌ర‌లించ‌డంలో ప్ర‌ముఖ పాత్ర వ‌హించాడు. దీంతో చాలా మంది స్థానికుల‌కు ఉపాధి అవ‌కాశాలు పుష్క‌లంగా వ‌చ్చాయి.
Visitors Are Also Reading