Home » ఎన్టీఆర్ సినిమాలకు అతను మాత్రమే ఎందుకు కొబ్బరి కాయలు కొట్టేవాడు ? ఆయనెవరు ?

ఎన్టీఆర్ సినిమాలకు అతను మాత్రమే ఎందుకు కొబ్బరి కాయలు కొట్టేవాడు ? ఆయనెవరు ?

by AJAY
Ad

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లను ఎక్కువగా నమ్ముతుంటారు. సినిమా ప్రారంభానికి ముహూర్తాలను ఖచ్చితంగా చూసుకుంటారు. అంతేకాకుండా సినిమా టైటిల్ విషయం నుండి హీరోయిన్ల ఎంపిక వరకూ ఇలా ప్రతిదాంట్లో కూడా సెంటి మెంట్లను ఫాలో అవుతుంటారు. అయితే ఇలా సెంటిమెంట్లను ఫాలో అవ్వడం ఇప్పుడే మొదలైంది కాదు. ఎన్టీఆర్ కాలం నుండి ఇలా సెంటిమెంట్లను ఫాలో అవుతున్నారు.

Sr.Ntr

Sr.Ntr

ముఖ్యంగా అన్నగారు తారక రామారావు ఎక్కువగా ఇలాంటి వాటిని నమ్మేవారు. ఎన్టీ రామారావు ఉదయాన్నే లేవడం కచ్చితంగా దేవుడికి పూజ చేయడం సమయానికి షూటింగ్ స్పాట్ లో ఉండటం చేసేవారు. అలా ఆచారాలు పాటించడం డిసిప్లేన్ వల్లే ఎన్టీఆర్ సక్సెస్ అయ్యారని కూడా చెబుతుంటారు. అంతేకాకుండా ఎన్టీ రామారావు తన ప్రతి సినిమాకు ఒకే వ్యక్తి చేత కొబ్బరికాయ కొట్టించేవారు అది కూడా ఆయనకు ఉన్న సెంటిమెంట్.

Advertisement

Advertisement

ఇక ఎన్టీ రామారావు సినిమాలకు కొబ్బరికాయ కొట్టింది కూడా మరెవరో కాదు ఆయన సోదరుడు త్రివిక్రమ్ రావు. దాదాపు ఎన్టీఆర్ చేసిన సినిమాలన్నింటికీ కొబ్బరికాయను త్రివిక్రమ్ రావు గారే కొట్టారు అంటే వారిద్దరి మధ్య ఎలాంటి అనుబంధం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ సినిమా వ్యవహారాలన్నీ త్రివిక్రమ్ రావే దగ్గరుండి చూసుకునేవారు. దాంతో మిగతా అందరికంటే ఎన్టీఆర్ గురించి ఎక్కువగా త్రివిక్రమ్ రావుకే తెలుసు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ రావుని మా గోల్డ్ బ్రదర్ అంటూ సంబోధించేవారు.

త్రివిక్రమ్ రావు ఎన్టీఆర్ నేషనల్ ఆర్ట్స్ అనే సంస్థను స్థాపించి సినిమాలను నిర్మించడం మొదలుపెట్టారు. ఎన్టీఆర్ హీరోగా ఈ బ్యానర్ పై త్రివిక్రమ్ రావు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. ఇక ఈ బ్యానర్ లోగో పై త్రివిక్రమ్ రావు ఫోటో కూడా ఉండేది. అంతేకాకుండా తన బ్యానర్ లో వచ్చిన ప్రతి సినిమా ప్రారంభానికి ముందు తమ తల్లిదండ్రుల ఫోటోను ప్రదర్శించేవారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ మరణించిన తర్వాత ఈ బ్యానర్ పై కాకుండా రామకృష్ణ పేరుతో …రామకృష్ణ సినీ స్టూడియోస్ పేరుతో బ్యానర్ ప్రారంభించి అదే బ్యానర్ లో సినిమాలను నిర్మించారు.

Also read: “గోవిందుడు అందరివాడేలే” సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా…? ఏం చేస్తుందంటే..?

Visitors Are Also Reading