అన్నగారు NTR నటుడుగానే కాకుండా రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. ముఖ్యమంత్రిగా ఆయన తెలుగు ప్రజలకు చేసిన సేవలు వెలకట్టలేనివి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తెలుగు ప్రజల కోసం నమ్ముకున్న కార్యకర్తల కోసం ధైర్యంగా అన్యాయాలను ఎదిరించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత అద్భుతమైన పథకాలను తీసుకువచ్చారు.
Advertisement
read also : వివాదంలో ‘వీరసింహారెడ్డి’ డైలాగ్స్.. ఆ నాయకులు వెధవలు అంటూ.. !
ఇక నందమూరి తారకరామారావు గారికి టాలీవుడ్ లో ప్రతీ నటుడితో ఆయనకు ఒక అనుబంధం ఉండేది. అలనాటి స్టార్ హీరో చిత్తూరు నాగయ్యని నాన్న అని సంబోధించేవారు. అలాగే నటి పండరి బాయిని అమ్మ అంటూ పిలిచేవారు. అంతకుముందు ఆ పాత్రలో వారు నటించడంతో అలాగే సంబోధిస్తూ గౌరవం ఇచ్చేవారు. సావిత్రి లాంటి మహానటిని ఆయన తన సొంత చెల్లెలిగా, గయ్యాలి పాత్రలకు పెట్టింది పేరుగా ఉన్న సూర్యకాంతమ్మను అత్త అంటూ పిలిచి ఆటపట్టించేవారు.
Advertisement
అయితే ఆయన కోడలా అంటూ పిలిచిన నటి కూడా ఉన్నారు. ఆమె మరెవరో కాదు ఎస్ వరలక్ష్మి. హీరోయిన్ గా తెరంగేట్రం చేసి ఎన్నో వందల సినిమాల్లో నటించిన వరలక్ష్మిని ఎన్టీఆర్ కోడలా అని పిలిచేవారు. అందుకు గల కారణం ఒక సినిమాలో వరలక్ష్మీ అన్న గారికి కోడలి పాత్రలో నటించింది. ఈ చిత్రంలో ఆయన బృహన్నల వేషం వేశారు. అప్పటినుంచి ఏస్ వరలక్ష్మితో సరదాగా ఉండేవారట పెద్దాయన. ఆ తర్వాత ఎన్టీఆర్ తో చాలా సినిమాలో కలిసి నటించిన వరలక్ష్మి ఎన్టీఆర్ తనను కోడలు అంటూ పిలవడం తనకు ఎంతో గర్వంగా ఉండేది అంటూ చివరగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
Advertisement
ఇవి కూడా చదవండి : రోజా పరువు తీసిన పవన్ కళ్యాణ్.. ఛీ.. రోజా.. ఓ డైమండ్ రాణి అంటూ !