నందమూరి కుటుంబం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నందమూరి తారక రామారావు.. మామూలు వ్యక్తిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి.. ఓ స్టార్ హీరోగా ఎదిగారు. అంతేకాదు… హీరో గానే కాకుండా నందమూరి తారక రామారావు రాజకీయాల్లోనూ రాణించారు. తెలుగుదేశం పార్టీని నిర్మించి… సీఎం కూడా అయ్యారు నందమూరి తారకరామారావు. సినిమాలు చేస్తూనే రాజకీయాలను కూడా కొనసాగించారు అన్న ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ కారణంగా… ఆయన కుటుంబం నుంచి చాలామంది హీరోలు, ప్రొడ్యూసర్స్ చిత్రపరిశ్రమకు పరిచయమైన సంగతి తెలిసిందే.
ఇప్పటికే టాలీవుడ్ లో నందమూరి కుటుంబానికి ప్రథమ స్థానం ఉందని చెప్పక తప్పదు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ మరణo గురించి ఓ ఆసక్తికర విషయం వైరల్ అవుతుంది. ఆయన చనిపోయే ముందు సీనియర్ హీరో అక్కినేని నాగేశ్వరరావు గారికి ఫోన్ చేశారట ఎన్టీఆర్. ఈ విషయం తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రచయిత కృష్ణకుమారి… వివరించారు. నందమూరి తారక రామారావు మరియు అక్కినేని నాగేశ్వరరావు మంచి మిత్రులని ఆయన వెల్లడించారు. అయితే కొంతమంది ఇండస్ట్రీ వ్యక్తుల కారణంగా వీరి మధ్య విభేదాలు వచ్చాయట.
Advertisement
Advertisement
ఆ తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి నట్లు రచయిత కృష్ణకుమారి వివరించారు. ఇక ఎన్టీఆర్ ఒకరోజు… అక్కినేని నాగేశ్వరరావుకు ఫోన్ చేసి తన ఇంటికి రమ్మన్నారట. నీతో భోజనం చేయాలని ఉందని… అలాగే కాస్త మాట్లాడాలని ఉందని అక్కినేని నాగేశ్వరరావు గారికి ఎన్టీఆర్ ఫోన్ చేశారట. అయితే దీనికి అక్కినేని నాగేశ్వరరావు… సరే వస్తానండి అంటూ రిప్లై ఇచ్చారట. ఇక అక్కినేని నాగేశ్వరరావు… ఎన్టీఆర్ ఇంటికి వెళ్లాలనుకునే సమయంలోనే… ఎన్టీఆర్ మరణించారని వార్త వచ్చింది. దీంతో అక్కినేని నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
కిమ్ కు భయంకరమైన వ్యాధి… బరువు 140 కిలోలు పెరిగాడా!
Sanghavi: ఒకప్పటి హీరోయిన్ సంఘవి ఇప్పుడెలా ఉందో తెలుసా ?
భోజనం చేసిన తర్వాత… ఈ తప్పులు చేయకండి!