రాజకీయనాయకులు సినిమా వాళ్లను కలిసి పొలిటికల్ మైలేజీ పెంచుకోవడం సర్వసాధారణం. చాలా మంది సెలబ్రెటీలే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయినవారు కూడా ఉన్నారు. పొలిటికల్ పార్టీలు కూడా పార్టి మైలేజ్ కోసం సినీతారలను తమ పార్టీలో కలుపుకోవడానికి చాలా ఆసక్తిచూపిస్తుంటారు. కొంతమంది నాయకులు ఏకంగా సినిమా ఆడియో ఫంక్షన్స్ లోనూ సందడి చేస్తుంటారు.
Advertisement
ఇదిలా ఉండగా గతంలో బాహుబలి బ్లాక్ బస్టర్ అయిన తరవాత ప్రధాని మోడీ బాహుబలి టీం ను కలిసి ముచ్చటించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ తో పాటూ జక్కన్నను కలిసి అభినందించారు. ఇదిలా ఉండగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు తెలంగాణలో పర్వటిస్తున్నారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించి ప్రసంగించనున్నారు.
Advertisement
ఇక ఈ పర్యటనతో సంధర్భంగా అమిత్ షా ఎన్టీఆర్ తో సైతం భేటీ కానున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీం పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తన నటనకు ప్రశంసలు అందుకున్నారు. అమిత్ షా సైతం ఎన్టీఆర్ నటన పై గతంలో ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉండగా తెలంగాణలో పర్యటిస్తున్న నేపథ్యంలోనే నేడు అమిత్ షా తో భేటీ కానున్నారు.
పదిహేను నిమిషాల పాటూ లంచ్ భేటీలో ఎన్టీఆర్ అమిత్ షా పాల్గొంటారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ అభిమానులు ఏకంగా ఎన్టీఆర్ సీఎం అంటూ నినాదాలు కూడా చేస్తుంటారు. కాబట్టి పొలిటికల్ అంశాల గురించి కూడా ఈ భేటీలో చర్చిస్తారా అన్న ఆసక్తినెలకొంది.