Home » ‘NTR’ కి ఇష్టమైన వంటలు చేసే ఆ “కాంతమ్మత్త ఎవరో తెలుసా..?

‘NTR’ కి ఇష్టమైన వంటలు చేసే ఆ “కాంతమ్మత్త ఎవరో తెలుసా..?

by Sravanthi
Ad

తెలుగు ఇండస్ట్రీలో అలనాటి నటులలో ఎన్టీఆర్ కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. చాలా సీరియస్ గా కనిపించే ఎన్టీఆర్, చిన్న పిల్లలను కూడా గారు లేదా మీరు అని సంబోధిస్తారు. ఆ విధంగా అయన అందరికి మర్యాద ఇచ్చేవారు. షూటింగ్ లొకేషన్స్ లో హీరోయిన్స్ లేదా ఆయన కంటే సీనియర్స్ ఉంటే ఎంతో గౌరవం ఇచ్చేవారు.
ఇక ఎంత సీరియస్ గా నటిస్తారో, కొన్ని విషయాల్లో అంత జోష్ గా ఉండేవారట. ఇక ఎన్టీఆర్ ఎంతగానో ఆట పట్టించే ఒకే ఒక నటిమని సూర్యకాంతం.. ఈమె ఇప్పటి యువతకు తెలియకపోవచ్చు కానీ అలనాటి సినిమాల్లో గయ్యాళి పాత్ర అంటే ఈమెకే పక్కా సూట్ అయ్యేది..ఇక ఆమె ఎంతో కష్టపడి సినిమాల్లో పైకి వచ్చారు. చిన్నతనం నుండే నటి కావాలని అనుకున్నారు. అందుకే స్టేజి షోస్ చేస్తూ నాటికల్లో నటించేవారు.

Advertisement

ఇక ఆమె నటించిన సత్య హారిశ్చంద్ర నాటకంలో సూర్యకాంతమ్మ నటనకు మెచ్చి దర్శకుడు సి పుల్లయ్య ఆమెకు మొదటి అవకాశం ఇచ్చారు. అప్పటినుంచి మొదలైన సూర్యకాంతం నటన ప్రస్థానం ఆమెను ఎక్కడికో తీసుకెళ్ళింది. సినిమాల్లోకి వచ్చిన టైంలో ఆమె పేరును మార్చాలని దర్శకుడు అడిగితే అందుకే ఆమె ఒప్పుకోలేదు. ఈ విషయంలో పుల్లయ్యతో గొడవకు కూడా దిగింది. సాధారణంగానే పుల్లయ్య ఒక పెద్ద దర్శకుడు. అలాంటి దర్శకుడికి ఎన్టీఆర్ కూడా ఎదురు చెప్పేవారు కాదు.అయన ఒక్క మాట చెప్తే కాదనే దైర్యం,ఎన్టీఆర్ లాంటి హీరోలు కూడా చేయరు.

Advertisement

కానీ సూర్యకాంతమ్మ ఆయనతో గొడవ పడి తన పేరు మార్చకుండా పంతం పట్టి తన మాట నెగ్గించుకుంది. ఆ విధంగా ఇండస్ట్రీకి వచ్చిన నుండి గయ్యాళిగానే ఉండేది. అదే పేరు స్థిరస్థాయిగా నిలిచింది. ఇక అప్పట్లో బాగా రెమ్యునరేషన్ తీసుకునే నటీమణుల్లో ఆమె ముందుండే వారు. హీరోయిన్స్ కి మించి ఆమె నెల జీతం ఉండేది. ఆమె షూటింగ్ కి వస్తోంది అంటే ఒక 50 మందికి సరిపడా భోజనాలతో లొకేషన్ లో అడుగుపెట్టేది. తానే స్వయం గా వండి అందరికి వండించేవారు. ఆ విధంగా ఎన్టీఆర్ ఆమె వంటల కోసం ఎదురు చూసేవారు. ముద్దుగా కాంతమ్మత్త అని పిలుస్తూ ఆమె తెచ్చిన వంటకాలను తినేందుకు వెయిట్ చేస్తూ ఉండేవారట.

also read:చిరంజీవితో మ‌గ‌ధీర గుర్రానికి ఉన్న సెంటిమెంట్ ఏంటో తెలుసా..? దాని కోసం ఏం చేశారంటే..?

Visitors Are Also Reading