తెలుగు సినిమాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గుర్తింపు తెచ్చకున్న నటుడు ఎన్టీరామారావు. పౌరానిక పాత్రలతో ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. కొత్త పథకాలతో తెలుగు వారి ఇళ్లలో వెలుగులు నింపారు. సినిమా కెరీర్ పరంగా రాజకీయంగా తనకు ఎదురులేదని నిరూపించుకున్న ఎన్టీఆర్ జీవితంలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుకున్నారు.
ALSO READ : SARAYU : బిగ్ బాస్ బ్యూటీపై కేసునమోదు…ఆ వీడియోనే కారణం..!
Advertisement
ఎన్టీఆర్ తన సతీమణి బసవతారకం మరణం అనంతరం లక్ష్మి పార్వతిని ప్రేమ వివాహం చేసుకున్నారు. లక్ష్మీ పార్వతికి అప్పటికే వీరగందం వెంకట సుబ్బారావుతో వివాహం జరగ్గా ఒక కుమారుడు కూడా ఉన్నాడు.
కానీ ఎన్టీఆర్ పై ప్రేమతో లక్ష్మీపార్వతి భర్తకు విడాకులు ఇచ్చి ఎన్టీఆర్ ను వివాహం చేసుకుంది. 1993 లో ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిల వివాహం జరిగింది.
Also Read: 1986 లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగులు సమ్మె ! ఎలా స్పదించారంటే ?
Advertisement
నిజానికి లక్ష్మీ పార్వతి 16 ఏళ్ల వయసులోనే ఎన్టీఆర్ ను స్క్రీన్ పై చూసి ఆయనతో ప్రేమలో పడిందట. ఎన్టీఆర్ ను తెలుగు చిత్రపరిశ్రమలోనే కింగ్ గా లక్ష్మీపార్వతి భావించేదట. అంతే కాకుండా ఎన్టీఆర్ ను లక్ష్మీపార్వతి దేవుడిగా భావించేది.
also read : Singer Revanth: అంగరంగ వైభవంగా సింగర్ రేవంత్ పెళ్లి..ఫోటోలు వైరల్..!
ఎన్టీఆర్ ను ఈ లోకానికే రాజుగా వర్ణిస్తూ లక్ష్మీ పార్వతి 1980 లోనే ఓ పాటను రాసింది. ఇక 1991లో మొదటి సారిగా ఎన్టీఆర్ బయోగ్రఫీని రాసేందుకు గానూ లక్ష్మీ పార్వతి ఆయనను కలిసింది. ఆ తరవాత ఎన్టీఆర్ అనారోగ్యం బారిన పడిన సమయంలో సేవలు చేసింది.
అంతే కాకుండా అదే సమయంలో ఇద్దరికీ ఒకరిపై మరోకరికి ఇష్టం కలిగి ఆ ఇష్టం కాస్తా ప్రేమగా మారింది. దాంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.
లక్ష్మీ పార్వతి గుంటూరు జిల్లా నర్సారావు పేటకు వాసి కాగా ఆమె లెక్చరర్ గా పనిచేయడంతో పాటూ రచనలు చేసేవారు.