ప్రముఖ నటుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావు జీవితం తెరిచిన పుస్తకం అన్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ జీవితంలో పెద్దగా పరిచయం లేని చాప్టర్ లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ ఆయన సతీమణి బసవతారకం మరణం తరవాత లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నారు. నిజానికి లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేశారు. ఇక అసలు లక్ష్మీపార్వతి ఎవరు…ఎన్టీఆర్ తో ఎలా పరిచయం ఏర్పడింది…ఆ పరిచయం ప్రేమగా ఎలా మారింది అన్నది ఇప్పుడు చూద్దాం…లక్ష్మీపార్వతి గుంటూరు జిల్లాలోని తెనాలిలో జన్మించారు. లక్ష్మీ పార్వతికి తొమ్మిదవ ఏటనే హరికథ కళాకారులు అయిన వీరగంధం వెంటక సుబ్బారావును వివాహం చేసుకుంది.
also read : తరుణ్ సినిమా దెబ్బకి … ప్లాప్ అయిన మహేష్ బాబు, నాగార్జున సినిమా ఎదో తెలుసా ?
Advertisement
లక్ష్మీ పార్వతికి విద్య ను నేర్పింది కూడా సుబ్బారావే….అంతే కాకుండా సుబ్బారావు లక్ష్మీ పార్వతిని ఎంఫిల్ వరకూ చదివించారు. నిజానికి వీరిద్దరిది మొదట గురు శిష్యుల బంధం…కానీ అది భార్యా భర్తల బంధంగా మారడానికి మాత్రం లక్ష్మీ పార్వతే కారణం అని ఓ సంధర్బంలో సుబ్బారావు వ్యాఖ్యానించారు. లక్ష్మీ పార్వతి బలవంతం కారణంగానే ఆమెను వివాహం చేసుకున్నానని చెప్పారు. కానీ లక్ష్మీ పార్వతి మాత్రం తాను అచేతన స్థితిలో ఉన్నప్పుడే సుబ్బారావుతో వివాహం జరిగిందని తెలిపింది.
Advertisement
ఇక వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ తో పరిచయం తరవాత సుబ్బారావుకు లక్ష్మీ పార్వతికి మధ్య ఏం జరింగిందన్నది ఇప్పటి వరకూ ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇదిలా ఉంటే ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ తన ప్రచారంలో వైవిద్యం కోసం హరికథా కళాకారులను భాగం చేశారు. అలా ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు వీరగందం సుబ్బారావు మరియు ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి పాల్గొన్నారు. ఇక ఎన్టీఆర్ అందానికి అందరూ ఫిదా అయినట్టే లక్ష్మీ పార్వతి కూడా ఫిదా అయ్యారట.
అంతే కాకుండా లక్ష్మీ పార్వతి తన 15వ యేటనే ఎన్టీఆర్ అంటే ఇష్టం పెంచుకున్నారట. ఆయన పై ఓ వ్యాసం కూడా రాశారట. అలా అప్పటికే ఎన్టీఆర్ ను ఇష్టపడిన లక్ష్మీ పార్వతి ఆయనను దగ్గరగా చూసి మరింత ప్రేమించింది. ఆ తరవాత ఎన్టీఆర్ జీవిత చరిత్రను రాసేందుకు లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ ఇంట్లోనే ఉండటం మొదలు పెట్టింది. అలా ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం అనుబంధంగా మారి ఇద్దరూ వివాహం చేసుకున్నారు.