Home » ఎన్టీఆర్ – కొరటాల సినిమా వాయిదా పడిందా…?

ఎన్టీఆర్ – కొరటాల సినిమా వాయిదా పడిందా…?

by Azhar
Ad
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న ఎన్టీఆర్ తా తర్వాత సినిమా టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివతో చేయబోతున్నట్లు ప్రకటించాడు. కానీ ఈ సినిమా అనేది ఇంకా కూడా సెట్స్ పైకి వెళ్ళలేదు. అయితే కొరటాల డైరెక్షన్ లో వచ్చిన తాజా సినిమా ఆచార్య అనేది డిజాస్టర్ గా నిలిచింది. ఆ కారణంగానే ఈ సినిమా అనేది ప్రారంభం కావడం లేదు అని తెలుస్తుంది. అయితే కొరటాల డైరెక్టర్ గా చిరంజీవి, రామ్ చరణ్ కలిసి వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఫ్యాన్స్ చాలా హోప్స్ అనేవి పెట్టుకున్నారు.
కానీ సినిమా విడుదల తర్వాత అది మొత్తం రివర్స్ అయ్యిపోయింది. దాంతో ఆ ప్రభావం అనేది కొరటాలపైనే ఎక్కువ పడింది అని తెలుస్తుంది. ఆయన ఈ సినిమా వల్ల చాలా ఆర్ధిక ఇబ్బందులో పడిపోయినట్లు తెలుస్తుంది. ఈ కారణంగానే ఎన్టీఆర్ తో సినిమా అనేది ఇంకా ప్రారంభం కాలేదు అని తెలుస్తుంది. అయితే తాజాగా ఎన్టీఆర్ తన అన్న కళ్యాణ్ రామ్ యొక్క బింబిసారా అనే సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చాడు. అయితే ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ తన కొత్త సినిమాకు సంబంధించిన కొత్త గెటప్ లో కనిపిస్తాడు అని అందరూ అనుకున్నారు.
ఎందుకంటే కొరటాలతో ఎన్టీఆర్ సినిమా అనేది ఈ ఆగస్టులో ప్రారంభం అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం మామూలుగానే కనిపించాడు. అందువల్ల ఎన్టీఆర్ కొరటాల సినిమా అనేది ఇప్పుడప్పుడే ప్రారంభం కావడం కష్టం అని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా అనేది వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఎన్టీఆర్ ఆ తర్వాతి సినిమా అనేది ప్రశాంత్ నీల్ తో తీయాలి. కానీ ఇప్పుడు ప్రశాంత్ సాలార్ తో బిజీగా ఉన్నాడు. అందువల్ల ఎన్టీఆర్ కొత్త సినిమా అనేది ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేది తెలియక ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

Advertisement

Visitors Are Also Reading