Home » ఆర్ఆర్ఆర్ కు మించిన స్థాయిలో అప్పట్లో వచ్చిన ఎన్టీఆర్ సినిమా అదేనా ??

ఆర్ఆర్ఆర్ కు మించిన స్థాయిలో అప్పట్లో వచ్చిన ఎన్టీఆర్ సినిమా అదేనా ??

by AJAY

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోలుగా…. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు…. గోండు బెబ్బులి కొమురం భీం ఒకవేళ కలిసి ఓ మంచి పని కోసం పోరాడితే ఎలా ఉంటుంది అనే దాన్ని ఊహించి కథ రాసుకుని ఈ సినిమాలో చూపించారు.

 

సినిమాలో బాలీవుడ్ నటులు అజయ్ దేవ్గన్, ఆలియా భట్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. అంతే కాకుండా హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ ఎన్టీఆర్ కు జోడిగా నటించిన ఆకట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్ లను రాబట్టిన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇదిలా ఉంటే 50 ఏళ్ల క్రితమే అన్నగారు ఎన్టీఆర్ ఆర్ఆర ఆర్ ను మించిన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఎన్టీఆర్ హీరోగా నటించిన కంచుకోట అనే సినిమా అప్పట్లో రికార్డులు క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని ఏడు లక్షల బడ్జెట్ తో నిర్మించారు. అయితే కేవలం ఏడు రోజుల్లోనే ఈ సినిమాకు 7 లక్షల కలెక్షన్లు వచ్చాయి. అంతేకాకుండా చాలా థియేటర్లలో ఈ సినిమా 100 రోజులు ఆడి ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు కే.వి.మహదేవన్ అందించిన స్వరాలు మరో హైలెట్ గా నిలిచాయి.

జానపద చిత్రంగా థ్రిల్లర్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఇదే ఫార్మాట్ లో మరికొన్ని సినిమాలు వచ్చాయి. కానీ బాక్సాఫీసు వద్ద ఆ సినిమాలు బోల్తా కొట్టాయి. అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో మూవీ లవర్స్ కంచుకోట సినిమాను పోలుస్తున్నారు. ఎన్టీరామారావు అప్పట్లోనే ఆర్ఆర్ఆర్ కంటే మించిన సినిమాను తీశారని కామెంట్స్ చేస్తున్నారు.

Also read :

కెజిఫ్ నటి రవీనా టాండన్ బాలయ్య బాబు కాంబో లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ఎదో తెలుసా ?

 

కేజీఎఫ్ లో జూనియర్ యష్ గా నటించింది ఎవరో తెలుసా…అతడి బ్యాగ్రౌండ్ ఇదే…!

Visitors Are Also Reading