Home » ఆస్కార్ రేస్ లో ఎన్టీఆర్.. హాలీవుడ్ స్టార్స్ తో పోటీలో కొమురం భీముడు

ఆస్కార్ రేస్ లో ఎన్టీఆర్.. హాలీవుడ్ స్టార్స్ తో పోటీలో కొమురం భీముడు

by Anji
Ad

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ తన నటనతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు. ఇక ఇప్పటివరకు ఏ ఇండియన్ స్టార్ కు కూడా దక్కని అరుదైన గౌరవం, గుర్తింపు ఎన్టీఆర్ కి దక్కింది. ఇక ఆస్కార్ సందడి ప్రారంభమైంది. త్వరలోనే ఆస్కార్ అవార్డుల యొక్క నామినేషన్స్ ని ప్రకటించనున్నారు. 

Advertisement

ఈ సమయంలో అంతర్జాతీయ ప్రముఖ మీడియా సంస్థలు ఆస్కార్ నామినేషన్స్ లో ఎవరుంటారు..? ఏ సినిమాలుంటాయి..? ఎవరికి అవార్డులు సాధ్యమనే ఊహాగాానాలతో పలు కథనాలు రాస్తుంటారు. ఇక ఆ మీడియా సంస్థలు ఊహించిన వారికే ఆస్కార్ అవార్డు గతంలో పలుమార్లు రావడం విశేషం. ఇక ఈ సారి కూడా ప్రముఖ వెరైటీ అనే అంతర్జాతీయ మీడియా సంస్థ ఉత్తమ నటులుగా ఎవరు ఆస్కార్ నామినేషన్స్ నిలుస్తారో అంటూ 10 మందితో కూడిన ఓ ఊహజనిత జాబితాను సిద్ధం చేసింది. అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు కూడా ఉండడం విశేషం.  

Advertisement

Also Read :  Prabhas: హీరో కాకపోయి ఉంటే ఆ పని చేసేవాడిని..!!

2023 ఆస్కార్ కి పోటీ పడుతున్న స్టార్ లలో మెహదీ జబెస్తానీ. ఆస్టిన్ బట్లర్ ఏడిన్ డాంబ్రైన్.. కొలిన్ ఫారెల్.. బ్రెండన్ ఫ్రెజర్.. హ్యు జాక్మన్, బిల్ నైఘి, కుపర్ రైఫ్ విల్ స్మిత్ పేర్లను వెరైటీ మీడియా సంస్థ పేర్కొంది. ఇక ఈ జాబితాలో తొలిసారి ఇండియన్ స్టార్ చోటు దక్కించుకుంటాడు. ఆ ఇండియన్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అవ్వడం ప్రతీ భారతీయుడు గర్వించదగ్గ విషయం అనే చెప్పాలి. ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటించిన విషయం విధితమే. వెరైటీ మీడియా సంస్థ చెప్పినట్టు ఎన్టీఆర్ కనుక ఆస్కార్ కి నామినేట్ అయితే తెలుగు సినిమా స్థాయి మరోసారి అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడడం ఖాయంగా కనిపిస్తోంది. 

Also Read :   పవన్ సినిమాల్లో నటించి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్లు !

Visitors Are Also Reading