Home » కొత్త లుక్ లో ఎన్టీఆర్‌.. కొర‌టాల సినిమా కోస‌మేనా ?

కొత్త లుక్ లో ఎన్టీఆర్‌.. కొర‌టాల సినిమా కోస‌మేనా ?

by Anji

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన సినిమా ద్వారా యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఇప్పుడు తారక్ చేయ‌బోయే త‌రువాత చిత్రం కోసం నందమూరి ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తార‌క్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వరుస విజయాలతో దూసుకుపోతున్న కొరటాల ఇటీవల ఆచార్య సినిమాతో మొదటి ఫ్లాప్ ను మూట‌క‌ట్టుకున్నాడు. ఆచార్య సినిమా నిరాశపరచడంతో తారక్ సినిమాపై మరింత ఫోకస్ పెట్టాడు కొరటాల. ఈ క్రమంలోనే ఓ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ను సిద్ధం చేశారని తెలుస్తోంది.

Also Read : ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ క్యూట్ చిన్నారి..ప్రస్తుతం టాప్ యాంకర్..కనిపెట్టండి..!!

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒక్కోరోజు ఒక్కో పేరు వినిపిస్తుంది. అలియాభ‌ట్‌, స‌మంత‌, ర‌ష్మిక ఇలా చాలా మంది పేర్లు వినిపించాయి. కానీ ఎవ్వ‌రి పేరు కూడా అధికారికంగా ప్ర‌క‌టించలేదు. ప్ర‌స్తుతం ఈ సినిమాలో తారక్ లుక్ గురించి అభిమానుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం తారక్ చాలా చేంజ్ అయ్యాడు. కాస్త బరువు కూడా పెరిగాడు. అయితే ఇప్పుడు కొరటాల సినిమా కోసం సన్నగా మారిపోయాడు. తారక్ లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Also Read : ఒకే ప్రేమ్‌లో మ‌హేష్ బాబు కుమారుడు గౌత‌మ్ కృష్ణ‌, కూతురు సితార‌..!

ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా జపాన్ వెళ్ళాడు తారక్ అక్కడ క్లిక్ మనిపించిన ఫోటోలలో తారక్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. తారక్ స్టైల్ మొత్తం కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అని ఫ్యాన్స్ అయితే చాలా సంబ‌ర‌పడుతున్నారు. అయితే ఎన్టీఆర్ ఈ షేప్ లోకి రావడానికి ప్రధాన కారణం కొరటాల శివ అని తెలుస్తోంది. ఎన్టీఆర్ 30వ సినిమాలో హీరో క్యారెక్టర్ కు తగ్గట్టుగా తారక్ ఇలా స్లిమ్ గా మారార‌ట ఎన్టీఆర్‌.

Also Read : అమ్మ బాబోయ్: స్టైలిష్ స్టార్ భార్య ధరించిన చీర ధర ఎంతంటే..?

 

Visitors Are Also Reading