Telugu News » Blog » ఎన్టీఆర్ ఫ‌స్ట్ హీరోయిన్ ఆస్తుల‌న్నీ ప్ర‌భుత్వం ఎందుకు స్వాధీనం చేసుకుందో తెలుసా…? ఇంట్రెస్టింగ్ స్టోరీ..?

ఎన్టీఆర్ ఫ‌స్ట్ హీరోయిన్ ఆస్తుల‌న్నీ ప్ర‌భుత్వం ఎందుకు స్వాధీనం చేసుకుందో తెలుసా…? ఇంట్రెస్టింగ్ స్టోరీ..?

by AJAY
Ads

అన్న‌గారు ఎన్టీరామారావు ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌లో న‌టించి స్టార్ హీరోగా ఎదిగారు. నాట‌క‌రంగం నుండి సినిమాల్లోకి వ‌చ్చిన ఎన్టీఆర్ త‌న న‌ట‌న‌తో అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఎన్టీఆర్ సినిమాల్లో త‌న న‌ట ప్ర‌స్థానం మ‌న‌దేశం సినిమాతో ప్రారంభించాడు. అయితే ఎన్టీఆర్ ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండా రావ‌డం వల్ల మొద‌టి సినిమాతోనే హీరో అయిపోలేదు. మొద‌ట చిన్న‌చిన్న పాత్ర‌లు చేసి ఆ త‌ర‌వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

Advertisement

మ‌న‌దేశంలో ఎన్టీఆర్ పోలీస్ పాత్ర‌లో న‌టించ‌గా ఈ సినిమాలో హీరోగా చిత్తూరు నాగ‌య్య న‌టించాడు. అంతే కాకుండా ఈ సినిమాలో హీరోయిన్ గా సి. కృష్ణ‌వేణి న‌టించింది. అలా ఎన్టీఆర్ మొదటి సినిమాలో కృష్ణ‌వేణి హీరోయిగా న‌టించింది. ఈ సినిమా త‌ర‌వాత కృష్ణ‌వేణి వ‌రుస ఆఫ‌ర్ లు అందుకున్నారు. రేలంగి వెంక‌ట్రామ‌య్య ద్వారా కృష్ణ‌వేణికి మొద‌టి సినిమా ఆఫ‌ర్ వ‌చ్చింది. ఆయ‌న నాట‌కాల‌ను నిర్మించేవారు.

Advertisement

Advertisement

ఇదిలా ఉంటే కృష్ణ‌వేణి వ‌రుస సినిమాలు చేస్తున్న స‌మ‌యంలో భోజ‌కాలిదాసు సినిమాలో రెండో హీరోయిన్ గా న‌టించారు. ఈ చిత్రాన్ని మీర్జాపురం రాజావారు నిర్మించారు. ఇక ఆయ‌న నిర్మాణంలో కొన్ని సినిమాలు చేసిన కృష్ణ‌వేణి ఆ త‌ర‌వాత ఆయ‌న‌కు రెండో భార్య‌గా వెళ్లారు. కొన్నేళ్ల త‌ర‌వాత రాజావారు మృతిచెందారు. ఆ త‌ర‌వాత కొన్నేళ్ల‌కు రాచ‌రిక‌వ్య‌వ‌స్థ అంతం అయ్యింది. అంతే కాకుండా రాజాగారి ఆస్థి ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకుంది. దాంతో కృష్ణ‌వేణి కోర్టును ఆశ్ర‌యించారు. ఇప్ప‌టికీ ఆస్తుల కోసం ఆమె కుటుంబ స‌భ్యులు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.