Home » ర‌జినికాంత్ త‌ర‌వాత ఆ రికార్డు మ‌ళ్లీ ఎన్టీఆర్ కే సొంతం..!

ర‌జినికాంత్ త‌ర‌వాత ఆ రికార్డు మ‌ళ్లీ ఎన్టీఆర్ కే సొంతం..!

by AJAY
Ad

నంద‌మూరి న‌ట‌వార‌సుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. త‌న న‌ట‌న డైలాగ్ డెలివ‌రీతో ఎన్టీఆర్ తాత‌కు త‌గ్గ మ‌న‌వ‌డు అనిపించుకున్నాడు. కేవ‌లం క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే కాకుండా ఎన్టీఆర్ ఏ పాత్ర ఇచ్చినా అందులో జీవించేస్తాడు. గుక్క తిప్ప‌కుండా డైలాగులు చెబుతూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తాడు. స్టూడెంట్ నంబ‌ర్ 1 సినిమాతో ఎన్టీఆర్ యూత్ ను త‌న‌వైపు తిప్పుకున్నాడు. ఈ సినిమా నుండి ఎన్టీఆర్ కు ఎక్కువ అభిమానులు అయ్యారు. ఎన్టీఆర్ యాక్ష‌న్, స్టైల్ అభిమానుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. ఇక ద‌మ్ము, ఆంధ్రావాలా లాంటి సినిమాల్లో మాస్ ఫైట్ల‌తో మాస్ ఆడియ‌న్స్ కు మ‌తిపోగొట్టాడు.

NTR

NTR

ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీం పాత్ర‌లో న‌టించాడు. ఇప్ప‌టికే ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల కాగా ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర‌లో జీవించిన‌ట్టు క‌నిపించారు. అయితే ఎన్టీఆర్ ఖాతాలో యంగ్ హీరోలు ఎవ‌రూ బీట్ చేయ‌లేని ఓ రికార్డు కూడా ఉంది. అది కూడా సూప‌ర్ స్టార్ ర‌జినీ క్రియేట్ చేసిన రికార్డును ఎన్టీఆర్ ఒక్క‌డే రీచ్ అయ్యాడు. సాధార‌ణంగా మ‌న హీరోల‌కు ప‌క్క రాష్ట్రాల్లోనూ అభిమానులు ఉండ‌టం సాధార‌ణ‌మే.

Advertisement

Advertisement

ntr bheem poster

ntr bheem

ఇక ఇప్పుడు పాన్ ఇండియా పున్య‌మా అని దేశ‌వ్యాప్తంగా హీరోలు అభిమానుల‌ను సంపాదించుకుంటున్నారు. కానీ విదేశాల్లో సైతం క్రేజ్ ను సంపాదించుకోవ‌డం అంటే మామూలు విష‌యం కాదు. కానీ ర‌జినీకాంత్ జ‌పాన్ లోనూ అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ర‌జినీ సినిమా వ‌చ్చిందంటే జ‌పాన్ లో ఆయ‌న అభిమానులు సినిమా చూసేందుకు ఎగ‌బ‌డి పోతుంటారు. అయితే యంగ్ హీరోలలో మ‌న దేశం నుండి ఎన్టీఆర్ ఒక్క‌డికే జ‌పాన్ లోనూ అభిమానులు ఉన్నారు.

rajinikanth ntr

ఎన్టీఆర్ హీరోగా న‌టించిన బాద్షా సినిమా నాటి నుండి ఎన్టీఆర్ కు జ‌పాన్ లో అభిమానులు అయ్యారు. ఈ సినిమా జ‌ప‌నీస్ లో డ‌బ్ అవ్వ‌డం సినిమాలో ఎన్టీఆర్ న‌ట‌న మ‌రియు డ్యాన్స్ చూసి జ‌ప‌నీస్ అభిమానులు అవ్వ‌డం జ‌రిగింది. అంతే కాకుండా ఇటీవ‌ల ఎన్టీఆర్ హీరోగా న‌టించిన అశోక్ సినిమాలోని ఓ పాట‌కు జ‌ప‌నీస్ అభిమానులు చేసిన డ్యాన్స్ వీరిలో వైల‌ర్ అయ్యింది.

Visitors Are Also Reading