హోటళ్ల వారు జనాలను దోచుకుతినేస్తున్నారని ఓ ఫైన్ మార్నింగ్ NTR కు అనిపించింది. టిఫిన్లు తిందామని వస్తున్న ప్రజల్ని హోటల్ వాళ్లు టిఫిన్ చేసేస్తున్నారనే ఓ ఒపీనియన్ NTR ఫామయ్యింది. హోటల్ లో ఏ టిఫిన్ ఎంతకి అమ్మాలో ఓ రేటు నిర్ణయించి జీవో సైతం విడుదల చేశాడు.
Advertisement
ఇడ్లీ ప్లేటు పది పైసలకన్నా ఎక్కువ అమ్మరాదు.దోశ పదిహేను పైసలు., పూరీ పదిహేను పైసలు, మసాలా దోశ ఇరవై పైసలు … ఇలా రేట్లు పెట్టారాయన.! ఒక ఫుల్ మీల్స్ రూపాయికే పెట్టాలి … ప్లేటు మీల్స్ అర్ధ రూపాయికే పెట్టాలనేది ఆ జీవో సారాంశం!
Advertisement
హోటళ్లోళ్లు గగ్గోలు పెట్టారు. హోటళ్లు కిక్కిరిసిపోయేవి. జనం రామారావు భలే చేశాడని ఇళ్లళ్లో వంటలు మానేసి మరీ హోటళ్లలో తినేయడం మొదలెట్టారు. ఇట్టా కొంత కాలం గడిచాక …. అప్పుడు హోటళ్ల వాళ్లందరూ బస్సులేసుకుని అబిడ్స్ ఎన్టీఆర్ ఇంటికి పోయి … వారి కాళ్ల మీద పడి అయ్యా … ఇది న్యాయమా … చచ్చిపోతామయ్యా అని బావురుమన్నారట! అప్పుడు NTR కాస్త సవరణ చేశాడట! ఉదయం ఆరింటినుంచీ ఎనిమిదింటి వరకూ టిఫిన్లను నిర్ణయించిన రేట్ల ప్రకారం అమ్మాలి, ఆ తర్వాత హోటల్ వాళ్ల ఇష్టం! భోజనం కూడా 12 గంటల నుండి 2 వరకు నిర్ణయించిన రేట్ల ప్రకారం అమ్మాలి…తర్వాత హోటల్స్ ఇష్టమని చెప్పేశాడట!
నిజానికి మొదట్లో ఆయన భోజనంలో వడ్డించే కూరలు ఎలా వండాలో కూడా ఒక ఫార్మెట్ పంపాడు హోటళ్ల వాళ్లకి అలా వండకపోతే హోటల్ సీజ్ చేస్తా అని బెదిరించాడు. ఇలా కొంత కాలం అయ్యాక మళ్లీ వెళ్లి కాళ్లా వేళ్లా పడి …. ఆయన్ని ఒప్పించి ఆ జీవోని ఉపసంహరింపచేయించారట!
Source : Bharadwaja Rangavajhala