Home » ఎన్టీఆర్ ఫ్యాన్ అరాచ‌కం…ఆ లుక్ తో బ్యాన‌ర్…నెట్టింట ట్రోల్స్..!

ఎన్టీఆర్ ఫ్యాన్ అరాచ‌కం…ఆ లుక్ తో బ్యాన‌ర్…నెట్టింట ట్రోల్స్..!

by AJAY
Ad

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా విడ‌ద‌ల‌కు సిద్ద‌మైంది. దాంతో అభిమానులు ఫుల్ కుషీ అవుతున్నారు. ఒక్క స్టార్ హీరో థియేట‌ర్ లోకి వ‌స్తేనే అక్క‌డ మామూలు ర‌చ్చ క‌నిపించ‌దు. అలాంటిది ఇద్ద‌రు స్టార్ హీరోలు రామ్ చ‌ర‌ణ్ ఎన్టీఆర్ స్క్రీన్ పై సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు.

Advertisement

మ‌రోవైపు స్టార్ డైరెక్ట‌ర్ జ‌క్క‌న్న సినిమా కావ‌డంతో ఆయ‌న అభిమానులు కూడా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఫ్యామీలీ ఆడియ‌న్స్ మాస్ ఆడియ‌న్స్ అనే తేడా లేకుండా సినీ ల‌వ‌ర్స్ అంద‌రూ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో థియేట‌ర్ వ‌ద్ద సంబురాలు మొద‌ల‌య్యాయి.

Advertisement

అయితే అభిమానులు థియేట‌ర్ ల వ‌ద్ద భారీ ప్లెక్స్ లు క‌డ‌తార‌న్న సంగ‌తి తెలిసిందే. కొంద‌రు వీరాభిమానులు ఏకంగా హీరో సినిమాలో ఏ గెట‌ప్ లో క‌నిపిస్తే అదే గెటప్ తో త‌మ క‌టౌట్ ను ఏర్పాటు చేసుకుంటారు. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా విడుద‌ల నేప‌థ్యంలో కూడా ఇద్ద‌రు హీరోల ఫ్యాన్స్ క‌టౌట్ ల‌ను క‌ట్టిస్తున్నారు.

Also Read: గుడిలోని అర్చ‌కుల‌ను సామాన్య ప్ర‌జ‌లు ఎందుకు తాక‌కూడ‌దో తెలుసా..?

కాగా తాజాగా ఎన్టీఆర్ అభిమాని ఒక‌రు ఏర్పాటు చేసిన క‌టౌట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ లో ఎన్టీఆర్ కొమురం భీమ్ లుక్ లోక‌నిపిస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే అదే లుక్ లో అభిమాని త‌న ప్లెక్స్ క‌ట్టుకున్నాడు. కేవ‌లం గోచీతో అభిమాని ఎన్టీఆర్ ఫోటో ప‌క్క‌న త‌న ఫోటో వేసుకున్నాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటో వైర‌ల్ అవుతుండ‌టంతో నెట్టింట ట్రోల్స్ వ‌స్తున్నాయి. మీమ‌ర్స్ త‌మ‌దైన స్టైల్ లో ఈ ఫోటో పై జోకులు వేస్తున్నారు.

Also Read: భ‌గ‌త్ సింగ్ వ‌ర్థంతి రోజే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌..!

Visitors Are Also Reading