Home » ఆ స‌మ‌యంలో డిప్రెష‌న్ లోకి వెళ్లా…ఆ త‌ర‌వాత హిట్లు వ‌చ్చినా సంతృప్తి లేదు : ఎన్టీఆర్

ఆ స‌మ‌యంలో డిప్రెష‌న్ లోకి వెళ్లా…ఆ త‌ర‌వాత హిట్లు వ‌చ్చినా సంతృప్తి లేదు : ఎన్టీఆర్

by Ajay

సినిమా ఇండ‌స్ట్రీలో ఎత్తుప‌ల్లాలు స‌హ‌జ‌మే….ఎంత పెద్ద‌హీరో అయినా కొన్ని సార్లు ఫ్లాపులు త‌ప్ప‌వు. ఒక‌ప్ప‌టి స్టార్ హీరోల నుండి ఇప్ప‌టి హీరోల వ‌ర‌కూ ప్ర‌తి ఒక్క‌రూ ఫ్లాప్ ల వ‌ల్ల క‌ష్టాలు ఎదుర్కొన్న వారే. ఇక తాజాగా తాను కూడా ఒక‌ప్పుడు ఫ్లాప్ ల‌తో డిప్రెష‌న్ లోకి వెళ్లాన‌ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎమోష‌న‌ల్ అయ్యారు. ఎన్టీఆర్ రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ…తాను ప‌దిహేడేళ్లకే హీరోగా ఎంట్రీ ఇచ్చాన‌ని చెప్పారు. రెండ‌వ సినిమాకే స్టార్ స్టేట‌స్ ను చూశాన‌ని అన్నారు.

ntr emotional

ntr emotional

కాగా కొన్నేళ్ల త‌ర‌వాత త‌న‌కు వ‌రుస డిజాస్ట‌ర్లు వ‌చ్చాయ‌ని ఎన్టీఆర్ ఎమోష‌న‌ల్ అయ్యారు. ఆ స‌మ‌యంలో డిప్రెష‌న్ లోకి వెళ్లాన‌ని ఎన్టీఆర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏం చేస్తున్నానో కూడా అర్థం కాని ప‌రిస్థితిలోకి వెళ్లిపోయాన‌ని ఆ స‌మయంలోనే రాజ‌మౌళి స‌హాయంతో ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకున్నాన‌ని ఎన్టీఆర్ వెల్ల‌డించారు. వ‌రుస ఫ్లాప్ ల‌తో ఉన్న త‌న‌తో రాజ‌మౌళి య‌మదొంగ సినిమా తీశార‌ని ఎన్టీఆర్ చెప్పారు.

also read : పూరీ ప్రేమ‌పెళ్లికి సాయం చేసిన టాప్ యాంక‌ర్, ప్ర‌ముఖన‌టి..ఏం చేసారో తెలుసా..!

ఆ సినిమాతోనే మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ అందుకున్నాన‌ని ఆ త‌ర‌వాత ఎన్నో విజ‌యాలు వ‌చ్చాయ‌ని కానీ పెద్ద‌గా ఎప్పుడూ సంతృప్తి చెంద‌లేద‌ని ఎన్టీఆర్ తెలిపారు. మ‌ళ్లీ ఆర్ఆర్ఆర్ సినిమాలో న‌టించడం సంతృప్తిని ఇచ్చింద‌ని చెప్పారు. ఈ సినిమా ద్వారా ఎన్నో నేర్చుకున్నాన‌ని ఎన్టీఆర్ వెల్ల‌డించారు. ఇదిలా ఉండ‌గా జ‌క్క‌న్న తెర‌కెక్కించిన తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ జ‌న‌వ‌రి 7న విడుద‌ల‌కు సిద్దంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్ర‌మోషన్స్ లోనే ఎన్టీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.


You may also like