Home » ప్రశాంత్ నీల్ సినిమాలో విలన్ గా ఎన్టీఆర్..?

ప్రశాంత్ నీల్ సినిమాలో విలన్ గా ఎన్టీఆర్..?

by Azhar
Ad
కన్నడ దర్శకుడు తాను తీసిన రెండో సినిమాతోనే మొత్తం దేశ వ్యాప్తంగా హల్ చల్ చేసాడు అనే చెప్పాలి. యష్ హీరోగా కెజిఎఫ్ సినిమా ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో హిట్ కావడంతో దాని సీక్వెల్ ను తీసి ఈ మధ్యే విడుదల చేసారు. అది కూడా భారీ హిట్ అందుకుంది. అయితే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సాలార్ అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సాలార్ సినిమా అనేది ఎప్పుడు విడుదల అవుతుంది అనేది క్లారిటీ లేదు. కానీ అంతకంటే ముందే తన తర్వాతి సినిమాను ప్రశాంత్ నీల్ అనౌన్స్ చేసాడు. ప్రశాంత్ నీల్ ప్రభాస్ తర్వాత మరో టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడు. ఎన్టీఆర్ కెరియర్ లో 31వ సినిమాగా వస్తున్న దీని యొక్క అధికారిక ప్రకటన అనేది ఎన్టీఆర్ బర్త్ డే నాడు చేసిన విషయం తెలిసిందే.
ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించి ఓ వార్త అనేది సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ డబల్ రోల్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అందులో ఒక్కరు హీరో కాగా.. మరొకరు విలన్ గా కనిపించబోతున్నారు అని సమాచారం. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాలతో సినిమా చేసి.. ఆ తరువాత ప్రశాంత్ నీల్ తో ఈ సినిమా ప్రారంభిస్తాడు.

Advertisement

Visitors Are Also Reading