Telugu News » Blog » బాల‌కృష్ణ చేతుల మీదుగా అవార్డు తీసుకుంటూ స్టేజీపైనే ఏడ్చిన ఎన్టీఆర్‌..!

బాల‌కృష్ణ చేతుల మీదుగా అవార్డు తీసుకుంటూ స్టేజీపైనే ఏడ్చిన ఎన్టీఆర్‌..!

by Anji
Ads

2001 సినీ గోయ‌ర్స్ అవార్డు ఫంక్ష‌న్‌ను నంద‌మూరి అభిమానులు ఎప్ప‌టికీ మ‌రిచిపోలేని ఓ సంఘ‌ట‌న జ‌రిగింది. జూనియ‌ర్ ఎన్టీఆర్ కు అవార్డు అంద‌జేయడానికి నంద‌మూరి బాల‌కృష్ణ‌ను, ఎన్టీఆర్ ఇద్దరినీ ఒకే వేదిక‌పైకి పిలిచారు. బాల‌య్య‌, ఎన్టీఆర్ ఇద్ద‌రూ స్టేజి మీద‌కు వ‌చ్చారు. బాల‌కృష్ణ మాట్లాడుతూ..అలా ఎన్టీఆర్ భుజం మీద చేయివేశాడు. అశేష జ‌నాభిమానంలో ఒక‌త‌ను త‌న స్నేహితునికి ఫోన్ చేసి బాల‌కృష్ణ ఎన్టీఆర్ భుజం మీద చేయి వేశాడురా..? అని ఫోన్‌లో మాట్లాడుతుండ‌గానే.. వెంట‌నే అత‌ని చేతిలో ఫోన్‌లాక్కున్నాడు మ‌రొక అభిమాని.

వారిద్ద‌రినీ ప‌క్కనే చూడ‌డానికి రెండు క‌ళ్లు చాల‌డం లేదు. నంద‌మూరి అభిమానుల‌కు ఇది ఒక పండుగ రోజు అని ఓ అభిమాని గ‌ట్టిగా అరిచాడు. మ‌రొక అభిమాని అవును ఇది నిజంగానే పండుగ‌రోజు అని కేక వేశాడు. అదే స‌మ‌యంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ బాల‌కృష్ణ‌తో ఏదో మాట్లాడుతున్నాడు. వీరిద్ద‌రూ ఒక‌రినొక‌రూ అభిమానంగా కౌగిలించుకున్నారు. అది చూసిన అభిమాని ఈ జీవితానికి ఇది చాలు అని త‌న క‌ళ్ల నుంచి వ‌చ్చిన క‌న్నీరు తుడుచుకున్నాడు. ఎంతో కాలంగా ఎన్టీఆర్ బాల‌కృష్ణ అభిమానులు ఎదురు చూసిన మ‌ధుర క్ష‌ణాలు నిజ‌మైన‌ప్పుడు ఆ అభిమానుల మ‌న‌స్సులో క‌లిగే సంతోషం ఇది.

ఇకే స్టేజీ మీద ఇద్ద‌రూ క‌లిసే స‌రికి అభిమానుల ఆందానికి హ‌ద్దే లేకుండా పోయింది. ప‌ట్ట‌రాని సంతోషంతో అభిమానాన్ని తెలుపుతూ తుఫాన్ వ‌చ్చిన వారి మాదిరిగా ఉర్రూత‌లు ఊగిపోయారు. బాబాయ్ బాల‌కృష్ణ చేతుల మీదుగా అవార్డు అందుకోబోతున్నాన‌ని ఆనందం ఎన్టీఆర్ క‌ళ్ల‌లో స్ప‌ష్టంగా క‌నిపించింది. ఎంతో కాలంగా బాబాయ్ ఆద‌ర‌ణ కోసం ఎదురు చూసిన ఎన్టీఆర్ ఆనందాన్ని చాలా మంది ప‌దిల ప‌రుచుకున్నారు. ఎన్టీఆర్‌తో అభిమానంగా బాల‌కృష్ణ మాట్లాడ‌డం చూసి అక్క‌డికి వ‌చ్చిన ఎంతో మంది సినీ పెద్దలు కూడా ఎంత‌గానో సంతోషించారు. ఆక్ష‌ణంలో ఆడిటోరియం మొత్తం ఒక్క‌సారిగా నిశ్శ‌బ్దంగా మారిపోయింది. వారిద్ద‌రి క‌ల‌యిక ప్రేక్ష‌కుల్లో ఉత్తేజాన్ని పెంచుతుంది. ఎప్పుడు ఎప్పుడు ఎన్టీఆర్ మాట్లాడుతారా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూశారు.

Also Read :  బ్యాడ్ టైమ్ లో చిరు,ప‌వ‌న్ ల‌ను ఆదుకున్న ఒకే ఒక్క ద‌ర్శ‌కుడు..ఆయ‌న ఎవ‌రు..? ఏం చేశాడు?

ఇప్ప‌టిదాకా మాట్లాడిన పెద్ద‌లంద‌రూ బాబాయ్ గొప్ప‌త‌నాన్ని ఎంత‌గానో చెప్పారు. అయితే వాట‌న్నింటిని క‌లిపి నేను ఒకే ఒక మాట చెబుతాను. ముఖ్యంగా స‌మ‌ర‌సింహారెడ్డి సినిమాలో 10 కుర్చీలు విర‌గ్గొట్టారు. అక్ష‌రాల 30 కేజీల పేప‌ర్ల‌ను చించారు. అయినా ఉద్వేంగం ఆగ‌డం లేదు. ఇక త‌ట్టుకోలేక సారీ బాబాయ్ అని ఏడ్చాడ్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌. అది చూసిన బాల‌కృష్ణ ద‌గ్గ‌రికీ వ‌చ్చి ఎన్టీఆర్ భుజంపై చేయి వేశాడు. ఆ స‌మ‌యంలో బాల‌కృష్ణ క‌ళ్ల‌లో ఉన్న నీళ్ల‌ను అక్క‌డ ఉన్న అభిమానులంద‌రూ గ‌మ‌నించారు. ఆడిటోరియం అంతా ఒక్క‌సారిగా నిశ్శ‌బ్దం అలుముకుంది. సినీ పెద్ద‌లు సైతం వారిద్దరినీ క‌ళ్ల‌కు అప్ప‌గించి చూస్తేనే ఉండిపోయారు.

మ‌ళ్లీ ఎన్టీఆర్ వెంట‌నే తేరుకొని అప్ప‌టికీ ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ మా బాబాయ్ బాల‌కృష్ణ కింగ్ అని.. చెప్ప‌గానే అభిమానుల ఉద్వేగం క‌ట్ట‌లు తెంచుకుంది. అభిమానుల అరుపులు, కేక‌ల‌తో ఆ ఆడిటోరియం అంతా మారు మ్రోగిపోయింది. వెంట‌నే బాబాయ్ కాళ్ల‌కు న‌మ‌స్కారం చేశారు జూనియ‌ర్ ఎన్టీఆర్‌. నేను ఈ రోజు ఈ స్థితిలో ఉండ‌డానికి కార‌ణం ముగ్గురు వ్య‌క్తులు అని.. వారిలో మొద‌టి వారు నంద‌మూరి తార‌క‌రామారావు తాత‌గారు, రెండు మా నాన్న హ‌రికృష్ణ‌, మూడు మా బాబాయ్ బాల‌కృష్ణ అని చెప‌పుకొచ్చారు. మా బాబాయ్ సిని జీవితంలో ర‌జ‌తోత్స‌వ వేడుక‌లు జ‌రుపుతున్న సంద‌ర్భంలో మొద‌టిపూల‌మాల నేనే వేయాల‌ని అక్క‌డున్న పూల‌మ‌దండ తీసుకొని బాల‌కృష్ణ మెడ‌లో వేశాడు జూనియ‌ర్ ఎన్టీఆర్‌.

ఇక సంస్థాప‌కులు ఇద్ద‌రూ క‌లిసి ఒక గ‌జ‌మాల వేశారు. ఇద్ద‌రూ ఒకే మాలలో ఉండ‌డం వ‌ల్ల జూనియ‌ర్ ఎన్టీఆర్ క‌ళ్ల‌లో వ‌స్తున్న క‌న్నీటిని బాగా గ‌మ‌నించిన బాల‌కృష్ణ న‌వ్వ‌రా న‌వ్వ‌రా న‌వ్వు అని ఎన్టీఆర్‌ను న‌వ్వించారు. దీంతో ఎన్టీఆర్ క‌ళ్ల‌ను తుడుచుకుని మ‌న‌సారా న‌వ్వించారు. ఇదంతా త‌మ కెమెరాల్లో బంధించ‌డానికి ఫోటో గ్రాఫ‌ర్లు ప‌డ్డ క‌ష్టం అంతా ఇంతా కాదు. ఇక కిందికి వ‌చ్చిన త‌రువ‌త ఎన్టీఆర్ 10 నిమిషాల పాటు మౌనంగా కూర్చుని ఉండిపోయారు. ఆరోజు జ‌రిగిన ఈ సంఘ‌ట‌న ఎన్టీఆర్ ఆనందానికి నంద‌మూరి అభిమానుల సంతోషానికి ఓ మంచి జ్క్షాప‌కం.

Also Read :  తొలిసారి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను చిరంజీవి ఇండ‌స్ట్రీకి ఎలా ప‌రిచ‌యం చేశారో తెలుసా..?


You may also like