Home » బాబాయ్ సినిమా చూస్తూ సీటు విరగొట్టిన ఎన్టీఆర్.. ఎందుకంటే..?

బాబాయ్ సినిమా చూస్తూ సీటు విరగొట్టిన ఎన్టీఆర్.. ఎందుకంటే..?

by Azhar

టాలీవుడ్ లో కొన్ని ఫ్యామీలలకు ఉండే ఫ్యాన్ బేస్ అనేది చాలా ఎక్కువ అందులో నందమూర్తి కుటుంబం కూడా ఉంటుంది. ఇందులో మొదటి హీరో అయిన సీనియర్ ఎన్టీఆర్ నుండి ఇప్పటి జూనియర్ ఎన్టీఆర్ వరకు చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు. అందులో ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ కూడా ఒక్కరు. ఈ మధ్య అఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బాలయ్య ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకపోతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

అయితే బాలయ్య అంటే జూనియర్ ఎన్టీఆర్ కు ఎంత ఇష్టం అనేది ఎవరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తన బాబాయ్ సినిమాలే చూస్తూ చిన్నపాటి నుండి పెరిగాను అని ఎన్టీఆర్ చాలాసార్లు చెప్పాడు. కానీ ఒక్కసారి మాత్రం బాబాయ్ సినిమా చూస్తూ థియేటర్ లోనే సిట్ ను విరగొట్టాను అని ఎన్టీఆర్ పేర్కొన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ… నేను బాబాయ్ యొక్క నరసింహ నాయుడు అనే సినిమా థియేటర్లో చూస్తూ… అందులోని సీన్లకు గంతులు వేస్తూ నా ముందు ఉన్న సీటును గట్టిగా తన్నాను.

దాంతో ఆ సీటు విరిగిపోయింది. అయిన నేను మాత్రం ఆగలేదు అని ఎన్టీఆర్ అన్నాడు. అయితే బాలయ్య కెరియర్ లో సూపర్ హిట్ సినిమాల్లో మొదటి స్థానంలో ఉండేది ఈ నరసింహ నాయుడు సినిమానే అనే విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఈ మధ్యే సూపర్ సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ, ప్రశాంత్ నీల్ ఆ తర్వాత త్రివిక్రమ్ ఇలా వరుసగా స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి :

బీసీసీఐకి డెడ్ లైన్ ప్రకటించిన ఐసీసీ…!

పెళ్లి అయ్యి నెల కాకముందే.. పెళ్లిపై దీపక్ షాకింగ్ కామెంట్స్..!

Visitors Are Also Reading