Home » మరోసారి అన్న కోసం తమ్ముడు ఎన్టీఆర్‌..!

మరోసారి అన్న కోసం తమ్ముడు ఎన్టీఆర్‌..!

by Azhar
Ad
టాలీవుడ్ లో పేరు ఉన్న ఫ్యామిలిలో నందమూరి ఫ్యామిలి కూడా ఒక్కటి. అయితే ఇప్పుడు ఈ ఫ్యామిలీ నుండి వచ్చి నిలదొక్కుకుని హీరో నందమూరి కళ్యాణ్ రామ్. గత కొంత కాలంగా హిట్ లేక  ఇబ్బందులో ఉన్న కళ్యాణ్ రామ్ కు ఇప్పుడు బింబిసార సినిమాతో సూపర్ హిట్ అనేది వచ్చింది. ఈ సినిమా అనేది ప్రకటించిన సమయంలో దీనిపై మరి ఎక్కువ అంచనాలు అనేవి లేవు.
కానీ ఈ బింబిసార సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కళ్యాణ్ రామ్ తమ్ముడు ఎన్టీఆర్ రావడంతో అంచనాలు పెరిగిపోయాయి. అంతే కాకుండా ఆ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఇచ్చిన స్పీచ్ అనేది కూడా అభిమానుల ఆలోచనలను మార్చేసింది. ఇక అందుకు తగ్గిన విధంగానే విడుదల తర్వాత బింబిసార అనే సినిమా సూపర్ హిట్ అని ప్రేక్షేకులు తేల్చేసారు. దీనికి పోటీగా సీతారామం అనే సినిమా వచ్చిన కూడా బింబిసార హిట్ గానే నిలిచింది.
ఇక మన టాలీవుడ్ లో విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా చేస్తారో.. ఆ సినిమా అనేది సక్సెస్ అయితే మాత్రం సక్సెస్ మీట్ కూడా అలానే నిర్వహిస్తారు. ఇక ఇప్పుడు బింబిసార సినిమాకు కూడా సక్సెస్ మీట్ అనేది చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు మరోసారి అన్న కోసం తమ్ముడు ఎన్టీఆర్‌ రాబోతున్నట్లు తెలుస్తుంది. బింబిసార సక్సెస్ మీట్ కు ఎన్టీఆర్ వస్తున్నాడు అని తెలుస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Advertisement

Visitors Are Also Reading