Home » ఎన్టీఆర్ నిర్ణయం కళ్యాణ్ రామ్ కు కలిసొస్తుందా..?

ఎన్టీఆర్ నిర్ణయం కళ్యాణ్ రామ్ కు కలిసొస్తుందా..?

by Azhar
Ad
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఫామ్ లో ఉన్నాడు అనేది అందరికి తెలుసు. అయితే ఇప్పుడు వరుస హిట్ అందుకొని ఉన్న ఎన్టీఆర్.. తన కొత్త సినిమాను కొరటాల డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఇక ఆ తర్వాత సినిమా ను కూడా పాన్ ఇండియా డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ తో చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాల నిర్మాణంలో కూడా ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ భాగస్వామిగా ఉన్నాడు.
అయితే కళ్యాణ్ రామ్ కు లాభాలు తేవాలనే ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అని తెలుస్తుంది. అయితే కళ్యాణ్ రామ్ తాను హీరోగా చేసే సినిమాలు అని తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పైనే నిర్మిస్తాడు అనేది అందరికి తెలుసు. కానీ గతంలో కళ్యాణ్ రామ్ తీసిన చాలా సినిమాలు ప్లాప్ కావడంతో నష్ట పోయిన అన్నను అందుకోవాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నాడు.
అందుకే ఎన్టీఆర్ ఆర్ట్స్ పైనే తాను హీరోగా జై లవకుశ అనే సినిమాలో ఎన్టీఆర్ చేసాడు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో కళ్యాణ్ రామ్ కు లాభాలు అనేవి వచ్చాయి. ఇక ఇప్పుడు అన్నకు ఇనాక్ ఏలువా లాభాలు తేవాలని తాను చేస్తున్న రెండు పెద్ద సినిమాల్లో కళ్యాణ్ రామ్ ను భాగం చేసాడు ఎన్టీఆర్. మరి ఈ ఆలోచన కళ్యాణ్ రామ్ కు కలిసొస్తుందా లేదా అనేది చూడాలి.

Advertisement

Visitors Are Also Reading