ఈ ఫ్రేమ్ లో ఉన్న ముగ్గురు మహిళలు… తెలుగు సినీ ఇండస్ట్రీని ఏలిన ముగ్గురు లెజెండ్స్ యొక్క భార్యలు. ఎడమ నుండి కుడికి వరుసగా అక్కినేని అన్నపూర్ణ ( అక్కినేని నాగేశ్వర్రావ్ భార్య ) , బసవతారకం ( NTR గారి భార్య ) , వీరమాచినేని వసుంధరా దేవి ( వి. బి. రాజేంద్రప్రసాద్ గారి భార్య) . చెన్నైలో జరిగిన ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో కలిసి దిగిన ఫోటో ఇది.
Advertisement
అక్కినేని అన్నపూర్ణ:
1933లో పుట్టిన అన్నపూర్ణ….1949 ఫిబ్రవరి 18న అక్కినేని నాగేశ్వరరావును పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. కుమారుల్లో నాగార్జున సినిమా హీరో కాగా, వెంకట్ సినీ నిర్మాత.
బసవతారకం:
Advertisement
1942 మే లో NTR బసవతారకంల వివాహం జరిగింది. వీరికి 12 మంది సంతానం. ఎనిమిది మంది కుమారులు , నలుగురు కుమార్తెలు. రామకృష్ణ (సీనియర్) జయకృష్ణ, సాయికృష్ణ. హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ (జూనియర్), జయశంకర్ కృష్ణ కుమారులు కాగా; గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు.
Also Read: RRRలో మల్లి పాత్రలో నటించిన చిన్నారి ఎవరు..?ఆమెకు జక్కన్న ఎలా అవకాశం ఇచ్చారంటే…?
వీరమాచినేని వసుంధరా దేవి:
వీరమాచినేని వసుంధరా దేవి.. ప్రముఖ నిర్మాత వి. బి. రాజేంద్రప్రసాద్ భార్య, జగపతిబాబు వీరి కుమారుడే , వీరికి జగపతిబాబుతో కలిసి మరో ఇద్దరు పిల్లలు.
Also Read: రాజమౌళి అమ్మ గారు చిరంజీవికి బంధువని తెలుసా ? ఎలాగంటే ?