ఒక సినిమా తీస్తున్నారంటే దానికి ఎన్నో కసరత్తులు చేయాలి. కథ సిద్ధం చేసుకోవాలి. కథనం ప్లాన్ చేసుకోవాలి అదేవిధంగా హీరో, హీరోయిన్ల సెలక్షన్ జరగాలి. ప్రస్తుతం హీరోకి తగ్గట్టుగానే హీరోయిన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. హీరో ఇమేజ్ కి పలానా అమ్మాయి అయితే సరిపోతుందా లేదా అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మరీ ఎంపిక చేస్తున్నారు.
Advertisement
ఒక్కొక్క సారి దర్శకుడు, నిర్మాత, హీరో కలిసే తమకు కావాల్సిన హీరోయిన్ని సెలక్ట్ చేసుకుంటారు. లేదా హీరోనే తనకు కావాల్సిన హీరోయిన్ ని దర్శకుడికి రికమండ్ చేస్తాడు. ఒక హీరోయిన్ సెలక్షన్ అనేది నేటి రోజుల్లో జరుగుతున్న పద్దతి ఇది. ఇదివరకు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు.. కథ రాసుకొని హీరోని నిర్ణయించుకున్నాక అసలు ఆ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకునే వాడు కాదు. తన కథకు సరిపోయే హీరోయిన్ నే దర్శకుడు ఎంచుకునేవాడు. సినిమాలో హీరోకి హీరోయిన్ కన్నా తక్కువ లెంత్ ఉన్న కూడా దర్శకుడు అస్సలు గొడవకు దిగేవారు కాదు. ఎంత చెబితే హీరో హీరోయిన్లకి అంతా నాటి రోజుల్లో ఇలా నడిచింది కానీ పరిస్థితి నేడు దీనికి పూర్తి భిన్నంగా మారిపోయింది.
ఇవి కూడా చదవండి : నన్నే తిట్టండి అంటున్న అక్షయ్ కుమార్..!
Advertisement
అప్పటి హీరోల్లో అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్ ఎంత ఫేమసో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అసరమే లేదు. వీరిపక్కన చాలా మంది హీరోయిన్లు నటించి స్టార్డమ్ సంపాదించుకోవాలని కలలు కనేవారు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఎన్టీఆర్‌కి అక్కినేని హీరోయిన్ల ఎంపికలో చాలా తేడా ఉంటుంది. ఆయన హీరోయిన్లతో ఎక్కువగా కలిసిపోతారు. తన పక్కన నటించే ప్రతీ హీరోయిన్ పై జోకులు వేస్తూ మచ్చిక చేసుకునేవారు. అంతేకాదు.. అప్పుడప్పుడు తిట్టినా కానీ హీరోయిన్స్ తప్పు పట్టేవారు కాదట.అక్కినేని హీరోయిన్స్ తో సమయం స్పెండ్ చేస్తూ.. వారిని దారిలోకి తెచ్చుకునే వారట.
ఇవి కూడా చదవండి : పాకిస్థాన్ ఇండియాను చూసి నేర్చుకోవాలి..!
అక్కినేనితో యాక్ట్ చేయడమనేది చాలా సరదా ఉంటుందనే భావన ఇండస్ట్రీలో ఎక్కువగా ఉండేది. అక్కినేని కేవలం తెలుగులోనే కాకుండా పలు భాషల్లో నటించి బయట హీరోయిన్స్ తో కూడా నటించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక ఈ విషయంలో అక్కినేనికి ఎన్టీఆర్‌కి చాలా తేడా ఉందనే చెప్పాలి. ఎన్టీఆర్ సెట్‌కి వచ్చామా..? షూటింగ్ పూర్తి చేశామా అన్ని షెడ్యూల్‌కి న్యాయం చేస్తామా అని మాత్రమే ఆలోచిస్తారు. సెట్లో ఉన్నా కూడా ఆయన ఎంతో సీరియస్‌గా తన పని తాను చేసుకుంటూ వెళ్తారు. ఆయనతో నటించాలంటే భయపడే హీరోయిన్స్ కూడా ఉన్నారు. ఎన్టీఆర్ హీరోయిన్ల విషయంలో చాలా వెనుకబడ్డానే చెప్పవచ్చు. షూటింగ్‌కి సమయానికి రావడం లేదంటూ స్టార్ హీరోయిన్ కేఆర్ విజయ పైన ఎన్టీఆర్ కోర్టులో కేసు కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది.
ఇవి కూడా చదవండి : తల్లితో కూడా గోపడవపడిన సమంత..!