సినిమా హీరోలకు ఫ్యాన్స్ ఉండటం కామన్. అయితే ఎంతమంది ఫ్యాన్స్ ఉంటే అంత గొప్ప. ఫ్యాన్స్ ఉంటేనే హీరోల సినిమాలు కూడా ఆడుతాయి. ఒకవేళ తమ ఫేవరెట్ హీరో సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అభిమానులు మాత్రం రెండు మూడు సార్లు కచ్చితంగా చూస్తారు. తమ హీరో ముఖాన్ని స్క్రీన్ పై చూస్తే చాలు ఆనంద పడిపోతారు. ఇక కొంతమంది హీరోలకు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే అభిమానులు ఉంటే… మరి కొంతమంది హీరోలకు ఇతర భాషల్లోనూ అభిమానులు ఉన్నారు.
అయితే హీరో రజనీకాంత్ కి మాత్రం ఇండియాలోనే కాకుండా జపాన్ లో కూడా అభిమానులు ఉన్నారు. రజనీకాంత్ హీరోగా నటించిన ముత్తు సినిమా జపాన్ లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత రజినీ నటించిన చాలా సినిమాలను జపాన్ లో విడుదల చేశారు.
రజినీ కాంత్ కు అక్కడ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండడంతో రజనీ హీరోగా నటించిన రోబో సినిమాకు వసూళ్ల వర్షం కురిసింది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కు కూడా జపాన్ లో అభిమానులు ఉన్నారు. రజినీ తర్వాత ఎన్టీఆర్ కే ఆ క్రెడిట్ దక్కింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమాలు జపాన్ లో కూడా విడుదలవుతాయి. రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్ లో భారీ వసూళ్లను రాబట్టింది.
ఈ సినిమా విడుదల నేపథ్యంలో ఎన్టీఆర్ జపాన్ కు వెళ్లి మరీ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఇక ఎన్టీఆర్ సినిమా ట్రైలర్ వచ్చినా టీజర్ వచ్చినా జపాన్ అభిమానులకు సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ పెడుతుంటారు. అయితే ఒక తెలుగు సినిమాకు ఇండియా వ్యాప్తంగా అభిమానులు ఉండటమే గ్రేట్… అలాంటిది జపాన్ లో కూడా ఎన్టీఆర్ అభిమానులను సంపాదించుకున్నాడు అంటే అది మామూలు విషయం కాదు.