Home » మరో హీరోతో జత కట్టబోతున్న ఎన్టీఆర్.. ఎవ్వరంటే…?

మరో హీరోతో జత కట్టబోతున్న ఎన్టీఆర్.. ఎవ్వరంటే…?

by Azhar
Ad

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో మల్టీ స్టారర్ సినిమాలు అనేవి ఎక్కువగా వస్తున్న విషయం తెలిసిందే. కానీ అందులో సీనియర్ హీరో, జూనియర్ హీరో కలిసి నటిస్తున్నారు. అయితే ఈ ఏడాది విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి ఇద్దరు యువ హీరోలు కలిసి ఒక్కే సినిమాలో నటించడం అనాధ పెద్ద విషయం. అయితే ఈ సినిమా అనేది దర్శకధీరుడు రాజమౌళి వల్లే సాధ్యం అయ్యింది అని చాలా మంది అంటున్నారు. అదలా ఉంటె.. ఇప్పుడు ఎన్టీఆర్ మరో స్టార్ హీరోతో కలిసి ఓ సినిమాలో నటించబోతున్నాడు తెలుస్తుంది.

Advertisement

అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ప్రభాస్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అందుకు కారణం బాహుబలి సినిమా. ఇక ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్.. అప్పటి నుండి అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. కానీ ఈ బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. అందుకే ఇప్పుడు హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే బాహుబలి సినిమా వల్ల ప్రభాస్ కు బాలీవుడ్ లో పెద్ద పరిచయాలు ఎక్కువగా పెరిగాయి. ఈ క్రమంలోనే అక్కడి డైరెక్టర్ తో ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ప్రభాస్, ఎన్టీఆర్ కలిసి ఒక్కే సినిమాలో చేయబోతున్నట్లు తెలుస్తుంది.

Advertisement

ఈ ఇద్దరూ ఇప్పుడు పాన్ ఇండియా హీరోలు. అలాగే ఇద్దరికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఉంది. అలాంటి వీరిద్దరితో కలిసి ఓ సినిమా నిర్మించాలని బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ భావిస్తున్నాడట. అందుకోసం ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాడట కరణ్. కానీ వీరిద్దరిని హ్యాండిల్ చేయగల దర్శకుడు ఇప్పుడు ఎవరున్నారు అనేది పెద్ద ప్రశ్న. అయితే ప్రభాస్, ఎన్టీఆర్ కలిసి ఒక్కే సినిమా చేస్తే అది సూపర్ హిట్ కావడం అనేహి పక్కా. మరి ఈ ప్రాజెక్ట్ అనేది అసలు పట్టాలు ఎక్కుతుందా.. కరణ్ జోహార్ ఇందులో సక్సెస్ అవుతాడా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి :

ఇంగ్లాండ్ బాగా ఆడింది.. అందుకే ఓడిపోయాం : ద్రావిడ్

కోహ్లీని అవమానించిన బాబర్.. ”ఏ రికార్డ్”..?

Visitors Are Also Reading